స్టార్ హీరోలంతా ప్రస్తుతం ప్యాన్ ఇండియా సినిమాలు చేస్తూ ఫుల్ బీజీగా గడుపుతున్నారు. ఒకేసారి ద్విభాష.. త్రిభాషా సినిమాలు చేస్తూ అన్ని ఇండస్ట్రీల్లో తనకంటూ ఫ్యాన్ ఫాలోయింగ్ పెంచుకుంటున్నారు. ఈ లిస్టులో టాలీవుడ్ హీరోలు ముందంజలో ఉన్నారు. అదేవిధంగా కన్నడ.. తమిళ ఇండస్ట్రీకి చెందిన పలువురు స్టార్స్ సైతం ప్యాన్ ఇండియా మార్కెట్ ను శాసిస్తున్నారు.
తమిళంలో రజనీకాంత్.. కమలహాసన్.. విక్రమ్.. సూర్య.. కార్తీ.. విజయ్.. ధనుష్.. శింబు.. కార్తీకేయన్.. కన్నడలో ఉపేంద్ర.. రాక్ స్టార్ యశ్.. రిషబ్ శెట్టి తదితర స్టార్స్ పరభాష సినిమాల్లోనూ తమకంటూ ఓ స్టార్డమ్ ను ఏర్పరుచుకుంటున్నారు. ఇక మన తెలుగులో ప్రభాస్.. రాంచరణ్.. ఎన్టీఆర్.. రానా.. అల్లు అర్జున్ తదితర హీరోలంతా ప్యాన్ ఇండియా రేసులో అందరి కంటే ముందంజలో ఉన్నారు.
అయితే తమిళ స్టార్ హీరో అజిత్ మాత్రం ఇందుకు భిన్నంగా వ్యవహరిస్తుండటం చర్చనీయాంశంగా మారింది. తమిళంలో అజిత్ కు ఫుల్ ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంది. తెలుగు ప్రేక్షకులకు సైతం అజిత్ అంటే చాలా ఇష్టం. కెరీర్ తొలినాళ్లలో అజిత్ నటించిన ‘ప్రేమలేఖ’ చిత్రాలు నేరుగా తెలుగు రిలీజై మంచి విజయాలు సాధించాయి.
ఈక్రమంలోనే అజిత్ నటించిన పలు సినిమాలు తెలుగులో డబ్బింగ్ అవుతూ వచ్చాయి. దీంతో ఇక్కడ కూడా అజిత్ మంచి ఫ్యాన్ బేస్ ఏర్పడింది. ప్రస్తుతం తమిళ హీరోలంతా ఒకేసారి తెలుగు.. తమిళ.. మలయాళం.. కన్నడ సినిమాల్లో ఒకేసారి రిలీజ్ చేస్తూ హిట్ కొడుతున్నారు. అయితే అజిత్ మాత్రం తన సినిమాలను తెలుగులో పెద్దగా ప్రమోట్ చేసుకోవడం లేదు.
అజిత్ తాజా చిత్రం ‘తునివు’ తమిళంలో ఈ సంక్రాంతికి విడుదలవుతోంది. అయితే ఈ సినిమా తెలుగు వర్షెన్ కు సంబంధించి నిన్నటి వరకు ఉలుకు పలుకు లేదు. ఉన్నట్టుండి రాధాకృష్ణ ఎంటర్ టైన్ మెంట్ సంస్థ ‘తునివు’ తెలుగు రైట్స్ ను మూడు కోట్లకు కోనుగోలు చేసింది. రేట్ విషయం పక్కన పెడితే తెలుగు ఈ సినిమాకు సంబంధించి ప్రచారమే ఇప్పటి వరకు లేకపోవడం గమనార్హం.
గతంలో అజిత్ నటించిన పలు సినిమాల విషయంలోనూ ఇలానే జరిగింది. అజిత్ గత చిత్రం ‘వలిమై’. ఈ సినిమాకు కనీసం తెలుగు టైటిల్ కూడా పెట్టకుండా ఇక్కడ విడుదల చేశారు. నిజానికి ఈ సినిమా బాగానే ఉంది. అయితే ఈ మూవీని తగిన ప్రచారం చేయకపోవడంతో పెద్దగా కలెక్షన్లు రాబట్టలేకపోయింది.
తాజాగా ‘తునివు’ విషయంలోనూ ఇదే సీన్ రిపీట్ అవుతోంది. దీంతో అజిత్ నీ తోటి హీరోలను చూసైనా నేర్చుకోవయ్యా.. మరీ ఇంత బద్ధకమైతే ఎలా అంటూ పలువురు కామెంట్స్ చేస్తున్నారు. ఇకపోతే అజిత్ తమిళంలోనూ తన చిత్రాలకు పెద్దగా ప్రమోషన్స్ చేయకపోవడం విశేషం. ఎవరెన్ని చెప్పినా అజిత్ మాత్రం తన రూటే సపరేటు అన్నట్లుగా ముందుకు పోతున్నాడు.