ఫిట్‌నెస్‌ ఏమో కానీ ముఖం తప్ప ఏం కన్పించడం లేదు

Update: 2019-05-02 01:30 GMT
ఫిట్‌ నెస్‌ చాలా ముఖ్యం. అది మనిషిని అందంగా ఉంచడమే కాదు ఆత్మవిశ్వాసాన్ని కలిగిస్తుంది. అందుకే స్టార్‌ క్రికెటర్ల దగ్గర నుంచి సినిమా వాళ్లవరకు ప్రతీ ఒక్కరూ ఫిట్‌నెస్‌పై దృష్టిపెట్టారు. ఇక రకుల్‌ ప్రీత్‌ సింగ్‌ విషయానికి వస్తే.. అందరికంటే హైట్‌ ఉంటుంది. మరి అందరికంటే హైట్‌ ఉంటుందని.. అందుకే అందరికంటే ముందు ఉండాలని ఆశ ఏమో కానీ వర్కవుట్‌ - జిమ్‌ కాస్త ఎక్కువే చేస్తుంది. అదే ఇప్పుడు రకుల్‌ కొంప ముంచిందేమో అన్పిస్తుంది ఆమెను చూస్తుంటే.

రకుల్‌ కు ఫిట్‌ గా ఉండడం అంటే చాలా ఇష్టం. ఆమె ఇన్‌ స్టా ఓపెన్‌ చేస్తే హాట్‌ గా ఉండే ఫోటోల కంటే జిమ్‌ లో కత్తుల రత్తమ్మలా కసరత్తులు చేస్తున్న ఫోటోలే ఎక్కువగా మనకు కన్పిస్తాయి. ఇక ఎఫ్‌ 45 జిమ్‌ ఓనర్‌ రకులేనన్న విషయం అందరికి తెలిసింది. అయితే.. ఈ మధ్యకాలంలో జిమ్‌ ఎక్కువుగా చేసి చేసి రకుల్‌ బాగా బక్కచిక్కిపోయింది. ఇంకా చెప్పాలంటే.. ఆమె శరీరంలో ముఖం తప్ప ఇంక ఏం కన్పించడం లేదు. ముఖం లావుగా - బాడీ మొత్తం సన్నగా ఉండడం వల్ల.. బాడీకి ముఖం తెచ్చి అంటిచారేమోనన్న ఫీలింగ్‌ వస్తుంది చూసేవాళ్లకు.

అమ్మాయిలు బొద్దుగా ఉంటేనే అందం. పట్టు పరికిణి వేసినా - చీర కట్టినా - మంచి డ్రెస్‌ వేసుకున్నా.. ఆ కట్టులో బొట్టులో ఏవైనా అందాలు కన్పించీ కన్పించనట్లుగా కన్పిస్తాయేమోనని అబ్బాయిలు ఎదురుచూస్తుంటారు. కానీ ఇలా గెడబొంగుకు డ్రెస్‌ వేసినట్లు రకుల్‌ కన్పించేసరికి ఎవ్వరికి ఆమెను చూడాలన్న ఆసక్తే కలగడం లేదు. సాధారణంగా తమకు నచ్చిన హీరోయిన్స్‌ ని అబ్బాయిలు కలల్లో ఊహించుకుంటారు. సౌందర్యలహరిలా అలా పరిగెత్తుకుంటూ వస్తున్నట్లు ఊహించుకుంటారు. కానీ రకుల్‌ ఊహించుకని కల గంటే అక్కడ కూడా ఆమె జిమ్‌ చేస్తున్నట్లే డ్రీమ్‌ వస్తుంది ఎవ్వరికైనా. అందుకే బక్క చిక్కిన ఈ భామ కాస్త బొద్దుగా అయితే బెటర్‌ అని ఫీలవుతున్నారు అభిమానులు.
Tags:    

Similar News