పొద్దుపొద్దున్నే ఇబ్బంది పెట్టేశారబ్బా

Update: 2016-12-14 09:30 GMT
రామ్ చరణ్ ఐదు రోజుల లాంగ్ షెడ్యూల్ పూర్తి చేసేశాడు. ధృవ ప్రమోషన్స్ లో భాగంగా సండే వరకూ యూఎస్ లోనే ఉన్న మెగా పవర్ స్టార్.. సురేందర్ రెడ్డి.. అరవింద్ స్వామిలతో కలిసి అక్కడి ఫ్యాన్స్ కు హుషారు తెప్పించాడు. ఇక అక్కడి టూర్ కంప్లీట్ చేసుకుని తాజాగా ఇండియా వచ్చేశాడు చరణ్.

ఇవాళ పొద్దునే హైద్రాబాద్ లో ల్యాండ్ అయిన రామ్ చరణ్ కి.. ఎయిర్ పోర్ట్ లోనే గ్రాండ్ వెల్ కం లభించింది. చాలా రోజుల తర్వాత భారీ హిట్ కొట్టిన చరణ్ కోసం.. అభిమానులు ఆతృతగా ఎదురుచూశారు. మరోవైపు ప్రయాణాల కోసం వచ్చి ఎయిర్ పోర్ట్ లో ఉన్న ఫ్యాన్స్ కూడా చెర్రీ చూడగానే గుమిగూడేశారు. అందరికీ ఓపికగా సమాధానాలు చెప్పిన చెర్రీ.. వారిచ్చిన బొకేస్ అందుకుని కృతజ్ఞతలు కూడా చెప్పాడు.

అయితే.. ఓ దశలో క్రౌడ్ ని కంట్రోల్ చేయడం కష్టం కావడంతో.. ఇక చేసేది లేక తన కారెక్కి వెళ్లిపోయాడు మెగాపవర్ స్టార్. కానీ ఓ విషయం మాత్రం ఒప్పుకోవాల్సిందే. ధృవ సక్సెస్ ఇచ్చిన జోష్.. చెర్రీ ఫేస్ లోనే కాదు బాడీలో అణువణువునా కాన్ఫిడెన్స్ నింపేసిందనే చెప్పాలి. అఫ్ కోర్స్ సినిమాకోసం బాడీ పెంచడంతో కూడా అలా అనిపించి ఉండచ్చులే.


Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/
Tags:    

Similar News