కోలీవుడ్ స్టార్ హీరో ధనుష్ క్రేజ్ గురించి చెప్పాల్సిన పనిలేదు. కోలీవుడ్ టాప్ స్టార్లలలో ధనుష్ ఒకరు. తెలుగు నాట ధనుష్‌కి మంచి ఫాలోయింగ్ ఉంది.` రఘువర్ బిటెక్`...`విఐపీ` లాంటి చిత్రాలు ధనుష్‌కి టాలీవుడ్ లో మంచి ఇమేజ్ ని తీసుకొచ్చాయి.
నేరుగా తెలుగు సినిమాలు చేయడానికి రెడీ అవుతున్నారు. ఇప్పటికే శేఖర్ కమ్ములా దర్శకత్వంలో ప్రాజెక్ట్ కమిట్ అయ్యారు. ఈ చిత్రాన్ని ఓ అగ్ర నిర్మాణ సంస్థ ప్రతిష్టాత్మంగా నిర్మిస్తుంది. కోలీవుడ్ రేంజ్ లో టాలీవుడ్ లోనూ సత్తా చాటాలని ఇక్కడా తెరంగేట్రం చేస్తున్నారు. కమర్శియల్ చిత్రాలతో పాటు డిఫరెంట్ అటెంప్ట్ లు చేయడం ధనుష్ ప్రత్యేకత.
ఆ రకంగానే బాలీవుడ్ లోనూ ఫేమస్ అయ్యారు. `రంజాన్` లాంటి సినిమా బాలీవుడ్ లో అగ్ర హీరో ఇమేజ్ ని తీసుకొచ్చింది. అయితే ఈ స్టార్ హీరో నటించని `మారన్` చిత్రం మార్చి 11న డిజిటల్ మాధ్యమంలో రిలీజ్ అయింది.
శుక్రవారం నుంచి సినిమా డిస్నీ హాట్ స్టార్ లో ప్రసార్ అవుతుంది. ఇందులో ధనుష్ కి జోడీగా మాళవిక మోహనన్ నటించింది. కార్తీక్ నరేన్ ఈ చిత్రానికి దర్శకత్వం వహించారు. అయితే భారీ అంచనాల మధ్య రిలీజ్ అయిన సినిమా అభిమానుల్ని తీవ్ర నిరాశకు గురి చేసినట్లు టాక్ వినిపిస్తోంది. సినిమాకి ఆద్యంతం నెగిటివ్ టాక్ వస్తోంది.
సినిమాలో థ్రిల్లింగ్ అంశాలు లేవని..ధనుష్ రేంజ్ స్ర్కిప్ట్ కాదని ఇలాంటి కథని ఎలా ఒప్పుకున్నారంటూ నెటి జనులు కామెంట్లు చేస్తున్నారు. ధనుష్ అభిమానులు సైతం సినిమా విషయంలో పెదవి విరిచేయడం విశేషం. సాధారణంగా అభిమానులు కాస్త బాధని పంటికింది నొక్కి పెట్టే ప్రయత్నం చేస్తుంటారు.
కానీ ధనుష్ విషయంలో అభిమానులు ఓపెన్ గానే ఉన్నట్లు కనిపిస్తుంది. మొత్తానికి `మారన్` ప్రేక్షకులనే కాకుండా అభిమానుల్ని నొప్పించినట్లే కనిపిస్తుంది.
ఇక ఈ సినిమా కథ విషయానికి వస్తే ఇందులో ధనుష్ హత్యకు గురైన ఇన్వస్టిగేషన్ జర్నలిస్ట్ రామ్ అనే వ్యక్తి కుమారుడి పాత్రలో నటించాడు. ఆద్యంతం సినిమా మిస్టరీ నేపథ్యంలోనే సాగుతుంది.
అయితే ధనుష్ పాత్ర ఆసక్తికరంగా సాగకపోవడం..థ్రిల్లింగ్ అంశాలు లేకపోవడం వంటికి సినిమాకి నెగిటివ్ గా మారింది. రోటీన్ సినిమాగానే అనిపిస్తుంది. దనుష్ పాత్రని మరీ పేలవంగా డిజైన్ చేసినట్లు అనిపిస్తుంది. సినిమా నిడివి మొత్తం రెండు గంటల 10 నిమిషాలు. ఇలాంటి సినిమాను రెండు గంటలు చూడటం కష్టం అంటూ నెటి జనులు ట్రోల్ సినిమా కంటెంట్ ని ఉద్దేశించి ట్రోల్ చేస్తున్నారు. ఇలాంటి సినిమా ధనుష్ ఎలా ఒప్పుకన్నారంటూ హీరోగారిని విడిచి పెట్టడం లేదు.