ఉగాది పండగకు పురస్కరించుకుని మహర్షి టీజర్ నిన్న విడుదలైపోయింది. ఇరవై నాలుగు గంటలు దాటకుండానే 10 మిలియన్ డిజిటల్ వ్యూస్ సాధించి అప్పుడే రికార్డుల వేట మొదలుపెట్టింది. అయితే దీని గురించి సోషల్ మీడియాలో జరుగుతున్న చర్చ మాత్రం ప్రిన్స్ ఫ్యాన్స్ కి కొంత టెన్షన్ కలిగిస్తోంది. అభిమానులను ఎంత మెప్పించినా మహర్షి టీజర్ లో నిజానికి కొన్ని రొటీన్ అంశాలు కనిపించాయి.
పోకిరి స్టైల్ లో పరిగెత్తడం శ్రీమంతుడు టైపు లో విలన్ కు వార్నింగ్ ఇవ్వడం భరత్ అనే నేను ఫార్మాట్ లో ఫైట్ చేయడం ఇలా అన్ని గత సినిమాల రెఫరెన్సులు ఎంత వద్దనుకున్నా గుర్తుకు వచ్చిన మాట వాస్తవం. ఇంకొందరికి సరైనోడు కూడా ఫ్లాష్ అయ్యింది. ఇది ప్రేక్షకుల తప్పు కాదు. టీజర్ ని అలా కట్ చేయడం వల్ల ఇలాంటి ఫీడ్ బ్యాక్ వచ్చిందని చెప్పుకోవచ్చు. ఇలా అన్ని మిక్సీ కొట్టి మహర్షిని తయారు చేశారా అనే మాట కూడా వినిపించింది
ఇంకో నెల రోజుల్లో సినిమా విడుదల కాబోతోంది. ఇప్పటికే రిలీజైన ఆడియో సింగల్ లో దేవి శ్రీ ప్రసాద్ స్వరం మీద ట్రాలింగ్ జరిగింది. పాట బాగున్నప్పటికీ దాని ఇంపాక్ట్ తగ్గిపోయిందనే అభిప్రాయం గట్టిగానే వినిపించింది. ఈ నేపధ్యంలో మహర్షి సం థింగ్ స్పెషల్ అనిపించేలా ఏదైనా ప్రమోషనల్ మెటీరియల్ వదలాలని అభిమానుల కోరిక. ఎలాగూ టైం ఉంది ఇంకా ట్రైలర్ రావాలి ప్రీ రిలీజ్ ఈవెంట్ చేయాలి ఫుల్ ఆల్బంని వదలాలి ఇన్ని ఉన్నాయి కాబట్టి పక్కాగా సెట్ చేసుకోవచ్చు.
మొత్తానికి మిలియన్ల వ్యూస్ తో ఒకపక్క హ్యాపీగా ఉన్నా టీజర్ ని ఇంకాస్త డిఫరెంట్ గా ప్రెజెంట్ చేసుకుంటే బాగుండేదన్న చిన్న ఫీలింగ్ అభిమానుల్లో వచ్చిందని అర్థమైపోయింది. సో ఇది ఖచ్చితంగా ట్రైలర్ ని కట్ చేసేందుకు హెల్ప్ చేస్తుంది కాబట్టి దాని కోసం వేచి చూద్దాం