విశ్వంభర ఫస్ట్ సింగిల్ వచ్చేదప్పుడే!
విశ్వంభర మూవీ ఓ వైపు షూటింగ్ జరుపుకుంటూనే మరోవైపు పోస్ట్ ప్రొడక్షన్ మరియు ఆడియో పనులను జరపుకుంటోంది.
మెగాస్టార్ చిరంజీవి గత కొన్ని సినిమాలుగా వరుస ఫ్లాపులందుకుంటున్నాడు. భోళా శంకర్ మరీ దారుణమైన ఫలితాన్నివ్వడంతో చిరంజీవి తన తర్వాతి సినిమా కోసం చాలా గ్యాప్ తీసుకుని విశ్వంభరతో మంచి హిట్ అందుకున్న వశిష్టతో విశ్వంభర అనే సినిమాను ఓకే చేశాడు. ఈ సినిమా సోషియో ఫాంటసీ డ్రామాగా తెరకెక్కుతున్న విషయం తెలిసిందే.
విజువల్ ట్రీట్ గా రూపొందుతున్న ఈ సినిమా కోసం ఫ్యాన్స్ ఎంతగానో వెయిట్ చేస్తున్నారు. వాస్తవానికి విశ్వంభర సంక్రాంతికే రిలీజవాల్సింది కానీ షూటింగ్ లేటవ్వడం, వీఎఫ్ఎక్స్ వర్క్స్ పెండింగ్ ఉండటంతో పాటూ మరికొన్ని కారణాల వల్ల సంక్రాంతి నుంచి సినిమా వాయిదా పడింది. మళ్లీ ఈ సినిమా ఎప్పుడు రిలీజవుతుందనేది మాత్రం మేకర్స్ ఇంకా వెల్లడించలేదు.
విశ్వంభర మూవీ ఓ వైపు షూటింగ్ జరుపుకుంటూనే మరోవైపు పోస్ట్ ప్రొడక్షన్ మరియు ఆడియో పనులను జరపుకుంటోంది. రీసెంట్ గా కీరవాణి ఇచ్చిన మ్యూజిక్ అదిరిపోయిందని డైరెక్టర్ వశిష్ట నెట్టింట అప్డేట్ ఇచ్చిన విషయం తెలిసిందే. వశిష్ట పోస్ట్ తర్వాత ఈ సినిమా మ్యూజిక్ పై అంచనాలు భారీగా పెరిగిపోయాయి. ఈ నేపథ్యంలో విశ్వంభర ఫస్ట్ సింగిల్ పై తాజాగా బజ్ వినిపిస్తోంది.
ఆల్రెడీ విశ్వంభర ఫస్ట్ సింగిల్ వర్క్ మొదలైందని, శివరాత్రి కానుకగా ఆ సాంగ్‌ను రిలీజ్ చేయాలని మేకర్స్ ప్లాన్ చేస్తున్నట్టు తెలుస్తోంది. చాలా కాలం తర్వాత చిరంజీవి, కీరవాణి కాంబినేషన్ ఈ సినిమాకు కుదరడంతో ఈ క్రేజీ కాంబో నుంచి ఎలాంటి మ్యూజిక్ వస్తుందో ఆడియన్స్ ఎంతో ఆతృతగా ఎదురుచూస్తున్నారు.
యువి క్రియేషన్స్ భారీ బడ్జెట్ తో రూపొందిస్తున్న ఈ సినిమాలో త్రిష హీరోయిన్ గా నటిస్తుండగా ఆషికా రంగనాథ్, ఇషా చావ్లా కీలక పాత్రల్లో నటిస్తున్నారు. ఈ సినిమాను చిరంజీవి కెరీర్లో భారీ హిట్ గా నిలిచిన జగదేక వీరుడు అతిలోక సుందరి రిలీజ్ రోజైన మే 9న ప్రేక్షకుల ముందుకు తీసుకురావాలని మేకర్స్ ప్లాన్ చేస్తున్నట్టు తెలుస్తోంది.