'భీమ్లా నాయ‌క్' రిలీజ్ ఆశ‌ల‌ పై నిర్మాత నీళ్లు!

Update: 2022-01-02 05:00 GMT
పాన్ ఇండియా చిత్రం `ఆర్ ఆర్ ఆర్` రిలీజ్ వాయిదాతో రిలీజ్ లు అన్ని మ‌ళ్లీ గంద‌ర‌గోళంలో ప‌డ్డాయి. ఉరుమెళ్లి మంగ‌ళం మీద‌ప‌డిన‌ట్లు `ఆర్ ఆర్ ఆర్` ఎప్పుడు రిలీజ్ అయినా ఆ ముందు..త‌ర్వాత రిలీజ్ లు అన్నింటికి `ఆర్ ఆర్ ఆర్` పెద్ద అడ్డంకిగా మారింది. జ‌న‌వ‌రి 7న `ఆర్ ఆర్ ఆర్` ఎలాగూ రిలీజ్ కాలేదు. ఓమిక్రాన్ వైర‌స్ దెబ్బ‌కి ఆర్ ఆర్ ఆర్ వాయిదా ప‌డింది. అయితే  జ‌న‌వ‌రి 12` భీమ్లా నాయ‌క్` ని బ‌రిలోకి దించుతారు? అని  ఊహాగానాలు కూడా తెర‌పైకి వ‌స్తున్నాయి. కానీ అది సాధ్య‌ప‌డ‌ద‌ని తెలుస్తోంది. తాజాగా `భీమ్లా నాయ‌క్` నిర్మాత నాగ‌వంశీ ట్వీట్ తో ఫుల్ క్లారిటీ దొరికేసింది.

`ఆర్ ఆర్ ఆర్` జన‌వ‌రి 7న క‌చ్చితంగా వ‌చ్చేస్తుంది అన్న న‌మ్మ‌కంతో `భీమ్లా నాయ‌క్` టీమ్ రిలాక్స్ అయింది. కొంత షూటింగ్ ఇంకా పెండింగ్ లోనే ఉంది. దాదాపు 10 రోజుల‌కు పైగా షూట్ బ్యాలెన్స్ ఉంది. అలాగే ఇప్పుడు ప‌వ‌న్  క‌ళ్యాణ్ కూడా అందుబాటులో లేరు. ఆయ‌న ఫ్యామిలీతో క‌లిసి ర‌ష్యా వెకేష‌న్ కి వెళ్లారు. ఎలాగూ అత్త‌గారు ఊరు కాబ‌ట్టి ప‌వ‌న్ రెండు ప‌నులు చూసుకుని వ‌ద్దామ‌ని అలా ర‌ష్యా ప్లైట్ ఎక్కేసారు. అలాగే రానాపై షూట్ చేయాల్సిన కొన్ని సీన్లు కూడా బ్యాలెన్స్ ఉన్నాయి. ఇంకా ప్రీ ప్రొడ‌క్ష‌న్ ప‌నులు..ప్ర‌చారం ప‌నులు  ఇలా `భీమ్లా నాయ‌క్`  మొత్తం సిద్దం అవ్వ‌డానికి ఎలా లేద‌న్నా నెల‌న్న‌ర‌న స‌మ‌యం ప‌డుతుంది.

`ఆర్ ఆర్ ఆర్` వాయిదా ప‌డింద‌ని ఇప్ప‌టికిప్పుడు `భీమ్లా నాయ‌క్` ని సంక్రాంతి రేసులోకి తీసుకురావ‌డం క‌ష్టం. అందుకే చిత్ర నిర్మాత నాగ‌వంశీ కూడా `డిజేటిల్లు` అనే మ‌రో  మీడియం చిత్రాన్ని పండుగ కానుక‌గా రిలీజ్  చేస్తున్న‌ట్లు ప్ర‌క‌టించారు. జ‌న‌వ‌రి 14 ఈ చిత్రాన్ని రిలీజ్ చేస్తున్నారు.  ఇందులో సిద్దు జొన్న‌ల గ‌డ్డ‌..నేహా శెట్టి జంట‌గా న‌టించారు. ఆ ర‌కంగా భీమ్లా నాయ‌క్ అభిమానుల‌కు ఇది చేదువార్త అనే అనాలి.
Tags:    

Similar News