ఎంపీ సంతోష్ కుమార్ ప్రారంభించిన గ్రీన్ ఇండియా ఛాలెంజ్ నేషనల్ ఛాలెంజ్ గా మారిపోయింది. కొన్ని వందల మంది సెలబ్రెటీలు ఇప్పటికే గ్రీన్ ఇండియా ఛాలెంజ్ లో భాగంగా మొక్కలు నాటారు. బాలీవుడ్ తో పాటు స్టార్ క్రికెటర్స్ ఇతర రంగాలకు చెందిన వారు కూడా గ్రీన్ ఇండియా ఛాలెంజ్ లో భాగంగా మొక్కను నాటి ఈ ఛాలెంజ్ ను నేషనల్ స్థాయికి తీసుకు వెళ్లారు. ఆయన ప్రారంభించిన ఈ ఛాలెంజ్ కొనసాగుతూనే ఉంది. ప్రతి ఒక్కరు కూడా ఈ ఛాలెంజ్ లో భాగంగా మొక్కలు నాటుతూ సామాజిక బాధ్యతను చాటుకుంటున్నారు. తాజాగా జాతిరత్నాలు సినిమా తో ఆకట్టుకున్న హైదరాబాదీ ముద్దుగుమ్మ తాజాగా బంగార్రాజు సినిమాలో ఐటెం సాంగ్ చేసిన చిట్టి అలియాస్ ఫరియా అబ్దుల్లా కూడా మొక్కలు నాటి గ్రీన్ ఇండియా ఛాలెంజ్ లో భాగస్వామ్యం అయ్యింది.
ఈ అమ్మడిని గ్రీన్ ఇండియా ఛాలెంజ్ కు నామినేట్ చేయడంతో ఆమె మొక్క నాటి గ్రీన్ ఇండియా ఛాలెంజ్ ను మరింత గా ముందుకు తీసుకు వెళ్లడంకు గాను నవీన్ పొలిశెట్టి మరియు ఆనంద్ దేవరకొండలను గ్రీన్ ఇండియా ఛాలెంజ్ లో భాగంగా నామినేట్ చేసింది. వారిని మాత్రమే కాకుండా ఇంకా తన స్నేహితులను కూడా ఈ జాతీయ ఛాలెంజ్ లో భాగస్వామ్యం చేయడంకు గాను ఆమె పిలుపునిచ్చారు. ఆమె అభిమానులు కూడా ఈ గ్రీన్ ఇండియా ఛాలెంజ్ లో పెద్ద ఎత్తున పాల్గొంటారని ఆశిద్దాం. గ్రీన్ ఇండియా ఛాలెంజ్ లో భాగంగా ఫరియా హైదరాబాద్ లో మొక్కను నాటారు. ఆమెతో పాటు గ్రీన్ ఇండియా ఛాలెంజ్ వాలంటీర్లు మరియు ఇంకా కొందరు ఆమె స్నేహితులు కూడా ఈ ఛాలెంజ్ లో పాల్గొన్నారు.
ఇక ఫరియా సినిమాల విషయానికి వస్తే జాతిరత్నాలు సినిమాలో నటించి తొలి సినిమా తోనే ఘన విజయాన్ని సొంతం చేసుకుంది. ఆ సినిమా విజయంతో ఈ అమ్మడు వరుసగా సినిమాలు చేస్తుందని అంతా భావించారు. కాని మెల్ల మెల్లగా ఈమె సినిమాలు చేస్తోంది. అఖిల్ అక్కినేని నటించిన మోస్ట్ ఎలిజబుల్ బ్యాచిలర్ సినిమాలో ఈమె చిన్న పాత్రలో కనిపించింది. తాజాగా బంగార్రాజు లో ఐటెం సాంగ్ చేసింది. ఆ పాట లో నాగ చైతన్యతో ఈ అమ్మడి మాస్ స్టెప్పులకు అంతా ఫిదా అవుతున్నారు. సినిమా విడుదల అయ్యి కాలం గడుస్తున్నా కూడా ఇంకా ఈ అమ్మడిని ఫరియా అని కాకుండా చిట్టి అనే పిలుస్తున్నారు. అంతగా ఈ అమ్మడి పేరు పాపులర్ అయ్యింది.