ఫోటో స్టోరి: చీరకట్టుకే అందం

Update: 2017-11-28 05:14 GMT
హైద్రాబాదీ భామ ఫాతిమా సనా షేక్ కు.. ఇప్పుడు ఫుల్ క్రేజ్ వచ్చేసింది. గతేడాది వచ్చిన దంగల్ మూవీతో ఈ భామ ఒక్కసారిగా స్టార్ అయిపోయింది. ఆమిర్ సినిమాలో ఆయనకు కూతురిగా నటించడం.. ఆవెంటనే మిస్టర్ పర్ఫెక్ట్ తో జోడీ కట్టే అవకాశం సంపాదించడం మాత్రం పెద్ద రికార్డ్ అనే చెప్పాలి.

థగ్స్ ఆఫ్ హిందుస్తాన్ అంటూ తెరకెక్కుతున్న భారీ చిత్రంలో నటిస్తోన్న ఫాతిమా సనా షేక్.. తనలోని హాట్ యాంగిల్ ను కూడా చూపించేస్తోంది. పొట్టి డ్రెస్సులు.. బికినీ పోజులతో హంగామా చేస్తున్న ఈ సుందరి.. ఇప్పుడు అచ్చమైన భారతీయ యువతి మాదిరిగా ఓ స్పెషల్ ఫోటో తీయించుకుని నెట్ లో పెట్టేసింది. చీరకట్టులో ఉన్న వయ్యారాలు ఏ స్థాయిలో ఉంటాయో చెప్పడం మానేసి చూపించేసింది ఫాతిమా. తన స్కిన్ కు పర్ఫెక్ట్ గా మ్యాచ్ అయ్యేలా కలర్ కాంబినేషన్స్ ఎంచుకుని చీర అందాలకు.. తన మెరుపులను జోడించేసింది ఫాతిమా.

తలపై రెండు చేతులు పెట్టుకుని వయ్యారాలు కురిపించిన వైనం అయితే అదరహో అనాల్సిందే. నడుం ఒంపుల నుంచి నాభి సొగసుల వరకూ ఓ ఎత్తయితే.. కళ్లతో ఆకర్షిస్తున్న వైనం మరో ఆకర్షణ. బాలీవుడ్ లో పాగా వేసేందుకు పర్ఫెక్ట్ ప్లాట్ ఫాం లభించిన ఆనందం.. ఆత్మ విశ్వాసం.. రెండూ ఫాతిమా సనా షేక్ లో కనిపించేస్తున్నాయి.
Tags:    

Similar News