ఫోటో స్టోరి: దంగల్ పిల్ల పట్టించుకోవట్లేదు

Update: 2017-11-07 17:36 GMT
దంగల్ సినిమా ఏ స్థాయిలో విజయం సాధించిందో అందరికి తెలిసిందే. కుస్తీ పోటీల నేపథ్యంలో వచ్చిన ఈ బయోపిక్ చైనా లో కూడా రికార్డు స్థాయిలో కలెక్షన్స్ రాబట్టింది. ఏకంగా చైనా అధ్యక్షుడే సినిమా స్పెషల్ షోను వేసుకొని మరి తిలకించి చిత్ర యూనిట్ ని ప్రశంసించారు. అయితే అందులో అమీర్ ఖాన్ నటనకు ఎంతగా పేరొచ్చిందో గీతా పోగాట్ పాత్రలో కనిపించిన  ఫాతిమా సనా షేక్ కి కూడా అదే స్థాయిలో పేరొచ్చింది.

అయితే సినిమా చూసిన తర్వాత అందరు ఫాతిమా ను ఒక హీరోయిన్ కన్నా ఒక ఐకాన్ గా గౌరవించాడం మొదలు పెట్టారు. దంగల్ సినిమా అమ్మడికి మంచి క్రేజ్ ని తెచ్చి పెట్టిందని చెప్పాలి. అయితే ఫాతిమా మాత్రం సోషల్ మీడియాలో హాట్ ఫిక్స్ పోస్ట్ చేస్తూ.. గ్లామర్ లోకాన్ని ఉర్రూతలూగిస్తోంది. అలాగే ఓ వర్గం వారికి కోపాన్ని తెప్పిస్తోంది. కానీ ఫాతిమా అవేమీ పట్టిచుకోవడం లేదు.

ఇప్పుడు ఒక ఫోటోలో చీరలో కొత్తగా కనిపిస్తూ.. కుర్రకారును తెగ ఆకర్షిస్తోంది. చూడడానికి ఫొటో లో అమ్మడు చాలా బావుంది అంటున్నారు నెటీజన్స్. ఇక మరికొందరు మాత్రం చీరలో ఇంత ఘాటు అవసరమా అనేలా కామెంట్ చేస్తున్నారు. మొత్తానికి ఫాతిమా అయితే సెక్సీ హీరోయిన్ గా గుర్తింపు తెచ్చుకోవాలని ప్రయత్నం చేస్తోన్నట్లుంది.
Tags:    

Similar News