మెగా ఫ్యామిలీలో చిరంజీవి పవన్ కళ్యాణ్ సహా ఓ పది మంది హీరోలు ఉన్నారు. ఆ ఫ్యామిలీ లో ఉన్నంత మంది హీరోలు మరే ఫ్యామిలీ లోనూ లేరు. అయితే ఈ ఏడాది ఆ కుటుంబంలోని అందరు హీరోల సినిమాలు తెరపై కనిపించి అలరించనున్నాయి. దీంతో ఫ్యాన్స్ పండుగ చేసుకోనున్నారు. ముందుగా మూడేళ్ల విరామం తర్వాత పవన్ కళ్యాణ్ నటించిన 'వకీల్ సాబ్ ' ఏప్రిల్ 9 న విడుదల కానున్నట్లు సమాచారం. అలాగే మలయాళ సినిమా అయ్యప్పనుమ్ కోషియం కూడా ఇదే ఏడాదిలో షూటింగ్ పూర్తి చేసి విడుదల చేసేందుకు పవన్ కళ్యాణ్ ప్లాన్ చేస్తున్నారు. క్రిష్ కాంబినేషన్ లో వస్తున్న సినిమాలోనూ నటించేందుకు డేట్స్ ఇవ్వనున్నాడు. మెగాస్టార్ చిరంజీవి హీరోగా రామ్ చరణ్ ప్రత్యేక పాత్రలో నటిస్తున్న ఆచార్య మూవీ మే 9న విడుదల చేసేందుకు కొరటాల శివ ప్లాన్ చేస్తున్నారు.
మెగాస్టార్ ఈ సినిమా తో పాటు లూసిఫర్ రీమేక్ కూడా తొందర్లోనే ప్రారంభం కానుంది.
చిరంజీవి చిన్న మేనల్లుడు పంజా వైష్ణవ్ నటించిన ఉప్పెన సినిమా కూడా ఏప్రిల్ లో విడుదల కానున్నట్లు సమాచారం. అలాగే క్రిష్ డైరెక్షన్ లో వైష్ణవ్ రెండో మూవీని కూడా పూర్తి చేశాడు. ఇక రామ్ చరణ్ రాజమౌళి దర్శకత్వంలో నటిస్తున్న ప్రతిష్టాత్మక సినిమా ఆర్ఆర్ఆర్ ఈ ఏడాది ఆఖరి సీజన్ లో విడుదలయ్యే అవకాశం ఉంది.
ఇక వరుణ్ తేజ్ ఈ ఏడాది రెండు సినిమాలతో అలరించనున్నాడు. కొత్త దర్శకుడు కిరణ్ దర్శకత్వంలో వరుణ్ బాక్సర్ గా నటించనున్న సినిమా తొందరలోనే సెట్స్ పైకి వెళ్లనుండగా, దీంతోపాటు ఎఫ్ 2 సీక్వెల్ లో నటించనున్నాడు. సుకుమార్ డైరెక్షన్ లో అల్లు అర్జున్ హీరోగా నటిస్తున్న 'పుష్ప ' ఇయర్ ఎండింగ్ లో వచ్చే అవకాశం ఉంది. సాయి తేజ్ హీరోగా దేవా కట్టా దర్శకత్వంలో చేస్తున్న సినిమా ముమ్మరంగా షూటింగ్ జరుపుకుంటోంది.
చిరంజీవి చిన్న అల్లుడు సూపర్ మచ్చి అనే సినిమాతో పాటు కొత్త దర్శకుడు రమణ తేజ చిత్రంలో నటిస్తున్నాడు. ఒక్క అల్లు శిరీష్ మాత్రం తన కొత్త సినిమా కోసం కథలు వింటున్నాడు. శిరీష్ కూడా ఈ ఏడాది ఆఖరి కల్లా ఒక్క సినిమా అయినా విడుదల చేసేందుకు ప్లాన్ చేసుకుంటున్నట్లు సమాచారం. ఈ ఏడాది చిరంజీవి నటించిన రెండు సినిమాలు, పవన్ కళ్యాణ్ నటించిన రెండు సినిమాలు విడుదల కానున్నాయి. వరుణ్ తేజ్ బాక్సర్ గా నటించే మూవీ, వెంకీతో ఎఫ్ - 3 మూవీతో రెండు సినిమాల్లో నటించనున్నాడు. అలాగే చరణ్ కూడా ఆర్ఆర్ఆర్ తో పాటు ఆచార్య సినిమాలో కనిపించనున్నారు. మెగా హీరోలు ఒక్కొక్కరి నుంచి రెండు సినిమాలు విడుదల అవుతుండటంతో ఫ్యాన్స్ ఫుల్ ఖుషీ అవుతున్నారు.