తెలుగు ఇండస్ట్రీలో చాలా మంది యాంకర్స్ ఉన్నారు. ఒకప్పుడు యాంకర్ అంటే చాలా పద్దతిగా ఉండాలి.. చీరలోనే కనిపించాలి.. అస్సలు గ్లామర్ షో చేయకూడదు అనేలా ఉండేది. కానీ ఇప్పుడు ఆ పరిస్థితి లేదు. ప్రతీ రంగంలో పోటీ ఉన్నట్లే యాంకరింగ్ కెరీర్ లో కూడా పోటీ ఎక్కువ అయిపోయింది. అందుకే ఇప్పుడు పరిస్థితులు మారిపోయాయి. ఇప్పుడు హీరోయిన్ల కంటే ఎక్కువగా.. ఇంకా చెప్పాలంటే వాళ్లను కూడా డామినేట్ చేసేలా యాంకర్స్ మారిపోయారు. అలా అని అందరూ గ్లామర్ షో చేస్తున్నారంటే పొరపాటే అవుతుంది. ఎందుకంటే ఇప్పటికీ సాంప్రదాయబద్దంగా యాంకరింగ్ చేసేవాళ్ళు ఉన్నారు. వాళ్లలో ఒకరు ప్రస్తుతం టాప్ యాంకర్ గా కొనసాగుతున్నారు. వెండితెరపై స్టార్ హీరోయిన్లు ఎవరన్నది కాలాన్ని బట్టి మారుతూ ఉంటుంది..కానీ బుల్లితెరపై ఈ యాంకర్ ఎప్పుడూ స్టార్ హీరోయిన్ రేంజే. ఆమె హోస్ట్ చేసిన ఏ కార్యక్రమం అయినా బంపర్ హిట్టే. ఇక సినిమా ఈవెంట్లు అయితే.. ఈమె డేట్స్ ఖాళీలేక ఆడియో - ప్రీ రిలీజ్ ఈవెంట్లను వాయిదా వేసుకుంటున్నారంటే ఆమె హవా ఏ రేంజ్లో ఉందో అర్థం చేసుకోవచ్చు. అందాలను ఆరబోస్తూ యాంకరింగ్ చేయాలని అత్యుత్సాహం చూపించే కొంతమంది యాంకర్లలా కాకుండా తన మాటలనే పెట్టుబడిగా పెట్టి టాప్ యాంకర్ గా విరజిల్లుతోంది ఈ యాంకర్. తెలుగు ఇండస్ట్రీలో ప్రస్తుతం ఉన్న యాంకర్స్ లో ఆమె తర్వాత స్థానంలో పాపులర్ షోలలో హాట్ హాట్ అందాలను ఆరబోసే ఇంకో యాంకర్ ఉందని చెప్పవచ్చు. ఆ టాప్ యాంకర్ తో పోల్చుకుంటే ఈమె పూర్తి ఆపోజిట్. హాట్ హాట్ ఫొటో షూట్లు చేస్తూ అందర్నీ ఆకర్షిస్తూ ఉంటుంది. అటు సినిమాలు.. ఇటు షోలు చేసుకుంటూ తనకంటూ ప్రత్యేక గుర్తింపు సంపాదించుకుంది ఈమె. ఓ వైపు స్టార్ హీరోల సినిమాలు చేస్తూనే.. మరోవైపు తనే హీరోయిన్ గా సినిమాలు కూడా చేసింది. అయితే ఈ మధ్య వీరిద్దరి మధ్య ఆధిపత్య పోరు నడుస్తోందని టాక్.
తాజాగా ఒక ప్రముఖ ఛానల్ కొత్తగా షో ప్రారంభించాలని సదరు టాప్ యాంకర్ ని సంప్రదించారట. ఆమె వారితో దాదాపు ఫోన్ లో అరగంట సేపు మాట్లాడి 'నేను మాట్లాడితే ఇలా ఉంటుందని' ఎక్స్ ప్లెయిన్ చేసి తన కండిషన్స్ - డిమాండ్స్ ఆ యాజమాన్యానికి చెప్పిందట. అయితే సదరు ఛానల్ వారు ఒకసారి ఈ హాట్ యాంకర్ ని కూడా టచ్ చేసి చూద్దామని ఆమెకి కాల్ చేశారట. ఈమె సదరు ఛానల్ లో షో చేయడానికి వెంటనే ఓకే చెప్పిందంట. ఈమెని తీసుకుంటే సినిమాల్లో లాగే అందాల ఆరబోతతో పాటు అన్ని విధాలా సెట్ అవుతుందని.. చెప్పినట్టుగానే విని యాంకరింగ్ చేస్తుందని ఛానల్ వారు భావించారట. అంతేకాకుండా రెమ్యూనరేషన్ విషయంలో కూడా ఆమె కంటే తక్కువ కాబట్టి అందులోనూ హాట్ యాంకర్ అయితే యూట్యూబ్ లో హిట్స్ కూడా ఎక్కువ వస్తాయని భావించిన ఛానల్ వారు హాట్ యాంకర్ నే ఫైనలైజ్ చేశారట. విషయం తెలుసుకున్న టాప్ యాంకర్ ఆగ్రహానికి లోనయిందంట. ఆ ఆగ్రహం తన ఆఫర్ తన్నుకుపోయిన యాంకర్ మీదనో.. ఆ ఛానల్ యాజమాన్యం మీదనో మరి. తర్వాత ఈ ఒక్క షో పోతేనేమి మన నంబర్ వన్ పొజిషన్ కి ఏమీ డోకా లేదులే అనుకుందట. మరోవైపు ఈ హాట్ యాంకర్ మాత్రం తనని కాదని నాకు షో ఇచ్చారంటే నేనే నెంబర్ వన్ అని - ఆమెని బీట్ చేసానని తెగ సంబరపడిపోతోందట. అయినా మనం ఎన్ని చెప్పుకున్నా నెంబర్ వన్ యాంకర్ ఎవరో ఆడియన్స్ కి తెలియదా చెప్పండి.