టాలీవుడ్ రేంజ్ మారిని తరుణం ఇది. ఇప్పుడు తెలుగు సినిమా అనే మాట పోయింది. పాన్ ఇండియానా? ఎన్నిభాషల్లో చేస్తున్నారు? లేదా? అంతకు మించి పాన్ వరల్డా? అన్నస్థాయికి టాలీవుడ్ చేరుకుంది. బాలీవుడ్ సహా అన్ని పరిశ్రమల నటులు తెలుగు సినిమావైపు తొంగి చూస్తున్నప్పుడే టాలీవుడ్ రేంజ్ మారిపోయిందని క్లారిటీ వచ్చేసింది.
మేకర్స్ సైతం ఆదిశగానే ఆలోచన చేస్తున్నారు. ఇక హీరైలేతో ఇమేజ్ సంబంధం లేకుండా పాన్ ఇండియా కి కనెక్ట్ అయితే కథ అయితే పచ్చజెండా ఊపి ముందుకెళ్లిపోతున్నారు. తాజాగా కొంత మంది తెలుగు దర్శకులు తొలి సినిమాతోనే పాన్ ఇండియాలో పరిచయమవుతుండటం విశేషం. ఓ సారి ఆ వివరాలు చూస్తే..
ఇటీవలే అడవి శేష్ 'జీ-2' చిత్రాన్ని ప్రకటించిన సంగతి తెలిసిందే. దీన్ని పాన్ ఇండియాలో తెరకెక్కిస్తున్నారు. వినయ్ కుమార్ అనే కొత్త కుర్రాడు దర్శకుడిగా పరిచయం అవుతున్నాడు. అంతకు ముందు ఎడిటర్ గా..అసిస్టెంట్ డైరెక్టర్ గా శేష్ సినిమాలకు పనిచేసాడు. తనలో పనితనం మెచ్చి శేషు ఇప్పుడు తననే దర్శకుడిగా పరిచయం చేసే బాధ్యతలు తీసుకున్నాడు.
అదీ పాన్ ఇండియా తొలి సినిమా డైరెక్ట్ చేయడం విశేషం. కంటెంట్ సహా మేకింగ్ పరంగా అన్నిరకాల జాగ్రత్తలు శేషు తీసుకుంటాడు. కాబట్టి వినయ్ విషయంలో కంగారు పడాల్సిన పనిలేదు. అలాగే మెగా వారసుడు వరుణ్ తేజ్ హీరోగా ఎయిర్ ఫోర్స్ నేపథ్యంలో ఓ సినిమా తెరకెక్కనుంది. దీనికి శక్తి ప్రతాప్ సింగ్ అనే కొత్త వ్యక్తి దర్శకత్వం వహిస్తున్నాడు.
ఇది పాన్ ఇండియాలో రిలీజ్ అవుతుంది. ప్రతాప్ కిదే తొలి సినిమా. అతనిలో ప్రతిభని మెచ్చి వరుణ్ అవకాశం కల్పించాడు. అలాగే యంగ్ హీరో నిఖిల్ ఇప్పటికే 'కార్తికేయ-2' తో పాన్ ఇండియాలో గుర్తింపు దక్కించుకున్నాడు. ఇప్పుడు 'స్పై' అనే ఓ సినిమా చేస్తున్నాడు. ఇది పాన్ ఇండియాలో రిలీజ్ కానుంది. గ్యారీ బీహెచ్ దర్శకుడిగా పరిచయం అవుతున్నాడు.
ఇతను శేష్ స్కూల్ కి చెందన వాడే. గతంలో 'గూఢచారి'.. 'హిట్'.. 'ఎవరు' వంటి సినిమాలకు ఎడిటర్ గా పని చేసాడు. అందుకే 'స్పై' బాధ్యతలు నిఖిల్ గ్యారీకి అప్పగించాడు. అలాగే నేచురల్ స్టార్ నాని హీరోగా నటిస్తోన్న 'దసరా' కూడా పాన్ ఇండియాలోనే రిలీజ్ అవుతుంది. ఈ సినిమాతో శ్రీకాంత్ ఓదెల అనే కొత్తకుర్రాడు దర్శకుడిగా పరిచయం అవుతున్నాడు. ఆ రకంగా యంగ్ మేకర్స్ అంతా తొలి సినిమాతోనే పాన్ ఇండియాలో పరిచయ మవుతున్నారు.
నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.