ఇటీవల బాలీవుడ్ ని పరాజయాల్లోంచి రక్షించే దేవుడు కనిపించలేదు. ఖాన్ లు ఫెయిల్.. కుమార్ లు ఫేడవుట్.. రోషన్ లు రారు.. కపూర్ లు అంతంత మాత్రమే. ఇలాంటప్పుడు పెద్ద హిట్టుతో ఆదుకునే దేవుడొకరు కావాలి. అతడే యంగ్ హీరో కార్తిక్ ఆర్యన్ అని ప్రూవైంది. ఆశించిన విజయం ఇన్నాళ్టికి దక్కింది. మొత్తానికి బాలీవుడ్ కి ఊరటనిచ్చే 180 కోట్ల షేర్ వసూళ్లను కార్తిక్ ఆర్యన్ నటించిన భూల్ భులయా 2 తెచ్చింది. ఇది నిజంగా పరిశ్రమకు మేలి మలుపు.
కార్తీక్ ఆర్యన్ కెరీర్ బెస్ట్ హిట్ ని అందుకోవడమే గాక.. కరోనా క్రైసిస్ తర్వాత ఇండస్ట్రీకి అవసరమైన బిగ్గెస్ట్ గిఫ్ట్ గా ఈ విజయాన్ని అందించాడు. ఆసక్తికరంగా కరణ్ జోహార్ లాంటి నిర్మాత తనకు క్రమశిక్షణ లేదని విమర్శించాక.. ఒక భారీ సినిమా నుంచి అవమానకరంగా తొలగించిన తర్వాత ఇప్పుడు కార్తీక్ ఆర్యన్ ప్రతి సవాల్ విసిరాడు. కళ్లు చెదిరే విజయంతో రివెంజ్ తీర్చుకున్నాడు.
ఇదంతా ఒకెత్తు అనుకుంటే ఇప్పుడు ఏకంగా భూల్ భులయా 2 నిర్మాత భూషణ్ కుమార్ హీరో కార్తిక్ ఆర్యన్ కి ఒక సొగసైన స్పోర్ట్స్ కారును బహుమతిగా ఇచ్చాడు. పరాజయాల్లో ఉన్న బాలీవుడ్ లో యంగ్ హీరో కార్తీక్ ఆర్యన్ ఒక మినహాయింపు. భూల్ భూలయ్యా 2 తో బ్లాక్ బస్టర్ సాధించాడు. ఈ చిత్రం ప్రపంచవ్యాప్తంగా రూ. 180 కోట్లకు (360కోట్ల గ్రాస్) పైగా షేర్ వసూలు చేయడమే గాక ఇప్పటికీ ప్రేక్షకులను థియేటర్లకు లాగడంలో సక్సెసవుతోంది.
ఈ విజయం భారతదేశపు మొట్టమొదటి మెక్ లారెన్ కారును కార్తిక్ కి గిఫ్ట్ రూపంలో పొందేలా చేసింది. T-సిరీస్ నిర్మాత భూషణ్ కుమార్ బహుమతిగా అందించారు. కారుతో కార్తీక్- భూషణ్ ల ఫోటోలను షేర్ చేస్తూ కార్తిక్ ఇలా రాసాడు. ''చైనీస్ ఖానే కే లియే నయీ టేబుల్ గిఫ్ట్ మిల్ గయీ మెహనత్ కా ఫల్ మీథా హోతా హై సునా థా..ఇట్నా బడా హోగా నహీ పాట థా ఇండియా మొదటి మెక్ లారెన్ జిటి అగ్లా బహుమతి ప్రైవేట్ జెట్ సర్. (కృషి కి ఫలం మధురమైనది.. కానీ ఇది భారతదేశపు మొట్టమొదటి మెక్ లారెన్ GT అని నేను ఎప్పుడూ అనుకోలేదు'' అంటూ ఆనందం వ్యక్తం చేసాడు.
అంతేకాదు.. తదుపరి బహుమతి ప్రైవేట్ జెట్.. సర్! అంటూ భూషణ్ కుమార్ ని అడిగేశాడు కార్తీక్ ఆర్యన్. అంటే మళ్లీ ఇదే కాంబినేషన్ లో మరో హిట్టు కొట్టాలన్న పంతం అతడిలో కనిపిస్తోంది.
కారును బహుమతిగా ఇచ్చిన సందర్భంగా నిర్మాత భూషణ్ కుమార్ మాట్లాడుతూ- ''ఈ స్పోర్ట్స్ కార్ కార్తిక్ కృషికి గ్రిట్ కి టోకెన్'' అని వ్యాఖ్యానించారు. ఈ కారు విలువ రూ. 4.7 కోట్లు. 3994 CC ఇంజిన్ తో గరిష్ట వేగం 326 కిలోమీటర్లు. భూషణ్ మాటలను బట్టి ఇది టోకెన్ మాత్రమే. అంటే కార్తీక్ కోరినట్టు ప్రైవేట్ జెట్ విమానం గిఫ్టిస్తాడా? అన్నది చూడాలి. కార్తీక్ ఆర్యన్ కి అందిన గిఫ్ట్ చూశాక.. అతడు మాత్రమే కాదు అభిమానులు కూడా ఫుల్ ఖుషీగా ఉన్నారు.