మెగాస్టార్ అతిథిగా ఫిలింక్రిటిక్స్ 55ఏళ్ల సావ‌నీర్ ఉత్స‌వం

Update: 2022-05-03 15:30 GMT
ఐదు ద‌శాబ్ధాల సుదీర్ఘ చ‌రిత్ర క‌లిగిన ఫిలింక్రిటిక్స అసోసియేష‌న్ ఇప్పుడు స‌రికొత్త కార్యాచ‌ర‌ణ‌తో ముందుకు వ‌స్తోంది. ఫిలిం క్రిటిక్స్ అసోసియేషన్ కొత్త పాలక వర్గం ఏర్పడిన తర్వాత కార్యవర్గ సమావేశాలు ఏర్పాటు చేసుకుని ఇటీవ‌ల‌ కొన్ని తీర్మానాలు చేసారు. ఆ తీర్మాన విశేషాలు ఇలా ఉన్నాయి.

తీర్మానాలు: 1) నూత‌న స‌భ్యుల‌ను చేర్చుకోవాల‌ని నిర్ణ‌యం.. ప్ర‌వేశ రుసుము 5000 నిర్ణ‌యించ‌డం జ‌రిగింది. కొత్త స‌భ్యులు 3 సంవ‌త్స‌రాల వ‌ర‌కు అసోసియేట్ స‌భ్యులుగా మాత్ర‌మే ఉంటారు. వారికి మొద‌టి మూడు సంవ‌త్స‌రాలు ఓటు హ‌క్కు, ఆ సంస్థ ఎన్నిక‌ల్లో పోటీ చేసే హ‌క్కు ఉండ‌దు. 3 సంవ‌త్స‌రాలు నిండిన త‌ర్వాత అసోసియేట్ స‌భ్యుల‌కు ఓటు హ‌క్కు ల‌భిస్తుంది. 5 సంవ‌త్స‌రాలు పూర్తయిన త‌ర్వాత ఎన్నిక‌ల్లో పోటీ చేసే హ‌క్కు వ‌స్తుంది.

2) రెన్యూవ‌ల్ ఫీజును 50 రూపాయ‌లు పెంచి 250 రూపాయ‌లు చేయ‌డం జ‌రిగింది.

3) స‌భ్యుల‌కు అసోసియేష‌న్ నుంచి ఎలాంటి ఆర్ధిక స‌హాయం ఇవ్వ‌కూడ‌ద‌ని నిర్ణ‌యించ‌డం జ‌రిగింది. దుర‌దృష్ట‌వ‌శాత్తు స‌భ్యులు ఎవ‌రైనా కాల‌ధ‌ర్మం చెందితే త‌క్ష‌ణ సాయం కింద 30000 (అక్ష‌రాల ముప్పై వేలు) ఇవ్వాల‌ని నిర్ణ‌యించ‌డం జరిగింది. ఈ మొత్తం గ‌తంలో 25000 రూపాయ‌లు ఉండేది. 5000 పెంచి 30000 చేయ‌డం జ‌రిగింది.

4) కేంద్ర‌ప్ర‌భుత్వం అమ‌లు చేస్తోన్న ఆయుష్మాన్ భార‌త్ స్కీమ్ ను స‌భ్యులంద‌రికీ వ‌ర్తింప చేసేందుకు కృషి చేయాల‌ని నిర్ణ‌యించ‌డం జ‌రిగింది.

5) స‌భ్యుల‌కు కొత్త ఐడీ కార్డులు ఇవ్వాల‌ని నిర్ణ‌యం తీసుకోవ‌డం జ‌రిగింది.

6) యోధ డ‌యోగ్నస్టిక్ సేవ‌లు ఉప‌యోగించుకునేందుకు స‌భ్యులు ఆన్ లైన్ ద్వారా ఎన్ రోల్ చేసుకునేలా ప్రొత్స‌హించ‌డం.

7) అసోసియేష‌న్ పేరిట వెబ్ సైట్, ట్విట్ట‌ర్ ఏర్పాటు చేయాల‌ని నిర్ణ‌యించి వెంటనే ట్విట్ట‌ర్ అకౌంట్ ఏర్పాటు చేయ‌డం జ‌రిగింది.

8) ఈసీ మీటింగ్ తీర్మానాలు జ‌న‌ర‌ల్ బాడీ తీర్మానాలు ఎప్ప‌టిక‌ప్పుడు వెబ్ సైట్ లో పెట్టాల‌ని నిర్ణ‌యించ‌డం జ‌రిగింది.

9) మ‌న అసోసియేష‌న్ నుంచి వెళ్లిపోయిన వారిని గౌర‌వంగా ఆహ్వానించి సంస్థ‌ను బ‌లోపేతం చేయాల‌ని నిర్ణ‌యించ‌డం జ‌రిగింది.

10) బి.ఎ. రాజు గారి గౌర‌వార్థం ఆయ‌న కుమారుడు శివ కుమార్ కి రెగ్యులర్ మెంబ‌ర్ షిప్ ఇవ్వాలని నిర్ణయం తీసుకోవడం జరిగింది. కార్యవర్గ సభ్యుల అంగీకారంతో శివ కుమార్ ని ఈసీ మెంబ‌ర్ గానూ తీసుకోవ‌డం జ‌రిగింది.

11. కొత్త స‌భ్యుడుగా శివ కుమార్ స‌న్నాఫ్ బి.ఎ.రాజు స‌భ్య‌త్వ రుసుం 5,000 రూపాయ‌లు కోశాధికారి హేమ సుంద‌ర్ కి పంపించ‌డం జ‌రిగింది.

12. ఫిల్మ్ క్రిటిక్స్ అసోసియేష‌న్ లో కొత్త స‌భ్యుల‌ను తీసుకోవాలని నిర్ణయించడం జ‌రిగింది. ద‌రఖాస్తుల‌ను కూడాఅందజేయడం జరిగింది.

13) ఫిల్మ్ క్రిటిక్స్ అసోసియేష‌న్ బ్యాంకు అకౌంట్ ను ల‌క్డీకాపూల్ నుంచి ఫిల్మ్ న‌గ‌ర్ బ్రాంచ్ కి మార్చాల‌ని నిర్ణ‌యించ‌డం జరిగింది.

14. పీఆర్వోల‌కు, ఫిల్మ్ ఛాంబ‌ర్ కు, ఫెడ‌రేష‌న్, మా, డైరెక్ట‌ర్స్ అసోసియేష‌న్ కి కూడా లెట‌ర్స్ ఇవ్వాల‌ని నిర్ణ‌యం.

15. గోల్డెన్ జూబ్లీ ఉత్సవాల కోసం బ్యాంకు అకౌంట్  ఓపెన్ చేయాలని కూడా నిర్ణయించాము.

16) ఫిల్మ్ క్రిటిక్స్ అసోసియేషన్ 55 ఏళ్ల సావ‌నీర్ కు రూపకల్పన. దీనికి ఒక కమిటి వేయనున్నారు. 55ఏళ్ళ ఫంక్షన్ ఘనంగా నిర్వహించాలి.  ఎఫ్.సి.ఎ గోల్డెన్ జూబ్లీ పంక్ష‌న్ కు సంబంధించిన కార్యాచరణకు రూపకల్పన చేయడం.

17) ఐడీ కార్డులు చేయించాలి.

18) మెంబ‌ర్ షిప్ రెన్యువ‌ల్ పెండింగ్ లో ఉన్న వారు చేయించుకోవాలని సభ్యులకు విన్నపం.

19) హెల్త్ ఇన్సూరెన్స్ చేయించ‌డం జరుగుతోంది దీని కోసం ఓ సంస్థ తో చర్చలు జరుగుతున్నాయి

20) స‌భ్యులు ఎవ‌రూ చ‌నిపోయినా ఆ కుటుంబానికి ఏదో ఒక సంస్థ‌తో క‌లిసి ఆర్ధిక సాయం అందించేందుకు కృషి చేయ‌డం .. వగైరా కార్య‌క్ర‌మాలు చేప‌డుతున్నామ‌ని క్రిటిక్స్ అధ్య‌క్షుడు సురేష్ కొండేటి వెల్ల‌డించారు.
Tags:    

Similar News