RRR లాంటి పాన్ ఇండియా మూవీలో నటిస్తూ సౌత్ లోనూ హాట్ ఫేవరెట్ గా మారింది ఆలియా భట్. రాజీ .. గల్లీ బోయ్స్ లాంటి బ్లాక్ బస్టర్ చిత్రాల్లో నటించినా ఈ అమ్మడు సౌత్ కి అంతగా తెలిసిందేమీ లేదు. కానీ జక్కన్న దృష్టిలో పడి ఆర్.ఆర్.ఆర్ కి ఎంపికవ్వడంతో ఒక్కసారిగా ఉత్తరాదిని మించిన ఫాలోయింగ్ దక్షిణాదిన తెచ్చుకుంది. ఇటీవల ఆలియా గురించిన ప్రతిదీ ఇక్కడ హాట్ టాపిక్.
ప్రస్తుతం ఆర్.ఆర్.ఆర్ పెండింగ్ చిత్రీకరణకు ఆలియా అటెండ్ కావాల్సి ఉంది. కానీ కరోనా కల్లోలం వల్ల అది సాధ్యమయ్యేట్టు కనిపించడం లేదు. అల్లూరి పాత్రధారి చరణ్ సరసన సీత పాత్రలో ఆలియా నటిస్తున్న సంగతి తెలిసిందే. ఆ పాత్రపై కొన్ని కీలక సీన్లు చిత్రీకరణ చేయాల్సి ఉందింకా. ఇక సౌత్ బేస్ చేసుకుని ఆలియాకు ఇదే భారీ పాన్ ఇండియా చిత్రం.
ఇదిలా ఉండగానే.. అలియా భట్ మరో రెండు పాన్-ఇండియా ప్రాజెక్టుల కోసం చర్చలు జరుపుతోందట. ప్రభాస్- నాగ్ అశ్విన్ కాంబినేషన్ మూవీ .. అలాగే ఎన్టీఆర్-ప్రశాంత్ నీల్ ప్రాజెక్ట్ లోనూ ఆలియా కథానాయికగా నటిస్తుందని ప్రచారం హోరెత్తిపోతోంది. ఇవి రెండూ సౌత్ ప్రాజెక్టులే. ఇదే నిజమైతే ఆలియా రేంజును ఇక ఇండియా లెవల్లో ఎవరూ టచ్ చేయడం కష్టమేనేమో! పారితోషికంలోనూ ఈ అమ్మడు ఇతర స్టార్లను మించిపోవడం ఖాయం. మరోవైపు ఆలియా భట్ నటించిన భారీ పాన్ ఇండియా చిత్రాల్లో బ్రహ్మాస్త్ర రిలీజ్ పెండింగులో ఉంది. దీంతో పాటే ఆర్.ఆర్.ఆర్ రిలీజ్ కూడా ఎప్పుడు? అన్నది చెప్పలేని పరిస్థితి ఎదురవుతోంది.