వీరనారి జాన్సీ లక్ష్మీ భాయి జీవిత చరిత్ర మూవీ అనగానే అంచనాలు ఆకాశాన్ని తాకేలా వచ్చాయి. అంచనాలకు తగ్గట్లుగా దర్శకుడు క్రిష్ భారీ ఎత్తున సినిమాను తెరకెక్కించేందుకు ప్రయత్నించాడు. సినిమా షూటింగ్ చాలా వరకు పూర్తి అయిన తర్వాత హీరోయిన్ కంగనా రనౌత్ మరియు నిర్మాతలతో వివాదం కారణంగా సినిమా నుండి తప్పుకున్నాడు. ఆ తర్వాత సినిమాను కంగనా పూర్తి చేసింది. ఇటీవలే రిపబ్లిక్ డే సందర్బంగా ప్రేక్షకుల ముందుకు వచ్చిన 'మణికర్ణిక' చిత్రం మంచి ఓపెనింగ్స్ ను రాబట్టుకోవడంతో పాటు వివాదాన్ని కూడా మూట కట్టుకుంది.
దర్శకుడు క్రిష్ సినిమా మొత్తాన్ని నేను తీస్తే చివరకు కంగనా క్రెడిట్ తీసుకుందంటూ ఆగ్రహం వ్యక్తం చేస్తూ మీడియా ముందుకు వచ్చాడు. మరో వైపు కంగనా అండ్ కో కూడా క్రిష్ వ్యాఖ్యలను తిప్పి కొట్టే ప్రయత్నం చేసింది. ఈ వివాదం మరియు సినిమాకు మిశ్రమ స్పందన రావడంతో ప్రపంచ వ్యాప్తంగా ఈ చిత్రం దాదాపుగా 100 కోట్లను రాబట్టింది. సినిమా బడ్జెట్ ను మొదట 60 కోట్లు అనుకున్నారు. అయితే క్రిష్ తప్పుకున్న తర్వాత కంగనా మళ్లీ చాలా సీన్స్ ను రీ షూట్ చేయడంతో బడ్జెట్ దాదాపుగా 90 కోట్లకు మించింది. ప్రమోషన్ ఖర్చులతో కలిపి మొత్తం నిర్మాతలతో 100 కోట్ల రూపాయలను కంగనా పెట్టించింది.
పెట్టిన బడ్జెట్ థియేట్రికల్ రైట్స్ ద్వారా వచ్చే పరిస్థితి లేదు. అయితే ఆన్ లైన్ రైట్స్ - శాటిలైట్ రైట్స్ ఇతర రైట్స్ తో మణికర్ణిక ఖాతాలో కనీసం 40 నుండి 50 కోట్ల వరకైనా పడే అవకాశం ఉంది. దాంతో నిర్మాతలు సేఫ్ అయినట్లే అంటూ ట్రేడ్ వర్గాల వారు అంటున్నారు. ముందుగా అనుకున్న బడ్జెట్ కు కాస్త అటు ఇటుగా అంటే 75 కోట్లు అయితే నిర్మాతలకు ఈజీగా పాతిక కోట్ల లాభాలు వచ్చేవి అనేది విశ్లేషకుల అభిప్రాయం. ఓవరాల్ గా ఇప్పుడు మణికర్ణిక చిత్రం ఫ్లాప్ కాదు, హిట్ కాదు యావరేజ్ అనేది తేలిపోయింది.