ఎట్ట‌కేల‌కు RRR+SAHOO డీల్ క్లోజ్

Update: 2019-06-15 05:47 GMT
ఇండియాస్ మోస్ట్ అవైటెడ్ మూవీస్ RRR+SAHOO ప్రీరిలీజ్ గురించి ఆస‌క్తిక‌ర చ‌ర్చ సాగుతోంది. ఇంత‌కీ ఈ రెండు సినిమాల‌ ఓవ‌ర్సీస్ డీల్ మాటేమిటి? అంటే గ‌త కొద్దిరోజులుగా స‌రైన ఆన్స‌ర్ లేదు. ఇప్ప‌టికే ఆ రెండు సినిమాల‌కు డీల్ క్లోజ్ అయ్యింద‌ని అగ్రిమెంట్లు కుదిరిపోయాయ‌ని వార్త‌లొచ్చాయి. దుబాయ్ కి చెందిన ఫ‌ర్స్ ఫిలిమ్  డిస్ట్రిబ్యూషన్ కంపెనీ టోకున రెండు సినిమాల్ని కొనేసింద‌ని ప్ర‌చార‌మంది.  దుబాయ్ వాలా ఎవ‌రో చాలా స్పీడ్ గానే ఉన్నార‌న్న ముచ్చ‌టా సాగింది.

అయితే ఈ డీల్ క్లోజ్ అవ్వలేదు. కేవ‌లం మంత‌నాలు సాగాయి. నిర్మాత‌ల వైపు నుంచి సంతృప్తి లేద‌న్న ప్రచారం సాగింది. మొత్తానికి ఫ‌ర్స్ ఫిలింస్ కంపెనీ నిర్మాత‌ల డిమాండ్ మేర‌కు త‌లొగ్గి డీల్ ని క్లోజ్ చేసింద‌ని లేటెస్ట్ గా తెలుస్తోంది. ఆర్.ఆర్.ఆర్ చిత్రం ఓవ‌ర్సీస్ కోసం 72 కోట్లు.. సాహో ఓవ‌ర్సీస్ హ‌క్కుల కోసం 48కోట్లు (మొత్తం 120కోట్లు) చెల్లించేందుకు డీల్ కుదిరింద‌ట‌. ఒక్క చైనా దేశంలో త‌ప్ప మిగ‌తా అన్ని దేశాల్లో ఈ సినిమాల్ని ఫ‌ర్స్ ఫిలింస్ సంస్థ రిలీజ్ చేసుకుంటుంద‌ట‌. ఆ మేర‌కు క్లోజ్ సోర్స్ వాక‌బులో విష‌యం తెలిసింది. ఈ డీల్ కి సంబంధించిన డివివి ఎంట‌ర్ టైన్ మెంట్స్ ... యు.వి.క్రియేష‌న్స్ విడివిడిగా ట్విట్ట‌ర్ ద్వారా వెల్ల‌డించ‌నున్నాయ‌ని తెలుస్తోంది.

ఇక‌పోతే ఈ రెండు సినిమాల్లో బాహుబ‌లి-2 రికార్డును బ్రేక్ చేయ‌డం మ‌ళ్లీ ఆర్.ఆర్.ఆర్ వ‌ల్ల‌నే అయ్యింది. బాహుబ‌లి స‌క్సెస్ నేప‌థ్యంలో బాహుబ‌లి 2 చిత్రానికి ఓవ‌ర్సీస్ ఏకంగా 64 కోట్లు (చైనా మిన‌హా) ప‌లికింది. అంటే ఇప్పుడు తిరిగి ఆ రికార్డును యాధృచ్ఛికంగా రాజ‌మౌళి తెర‌కెక్కిస్తున్న ఆర్.ఆర్.ఆర్ మాత్ర‌మే బ్రేక్ చేయ‌గ‌లిగింది. ఇక ప్ర‌భాస్ హీరోగా సుజీత్ ద‌ర్శ‌క‌త్వం వ‌హిస్తున్న సాహో చిత్రం 48 కోట్ల మేర ఓవ‌ర్సీస్ బిజినెస్ చేసింది. అంటే బాహుబ‌లి 2 కి ద‌రిదాపుల్లో లేనేలేద‌ని అర్థ‌మ‌వుతోంది. ఆస‌క్తిక‌రంగా ఆర్.ఆర్.ఆర్... సాహో చిత్రాలు ఇంచుమించుగా ఒకే బ‌డ్జెట్ ( 250-300 కోట్లు) తో తెర‌కెక్కుతున్న‌వేన‌న్న ప్ర‌చారం సాగుతోంది.
Tags:    

Similar News