ఈ తమిళ హీరోకి చైనాలో 500 కోట్ల క్లబ్?
పరిమిత బడ్జెట్ లో సినిమాలు తీసి విజయం సాధిస్తే, అలాంటి సినిమాలతో భారీ లాభాలొస్తాయని అన్నారు కరణ్ జోహార్.
పరిమిత బడ్జెట్ లో సినిమాలు తీసి విజయం సాధిస్తే, అలాంటి సినిమాలతో భారీ లాభాలొస్తాయని అన్నారు కరణ్ జోహార్. అదే కేటగిరీకి చెందుతుంది అమీర్ ఖాన్ వారసుడు జునైద్, తమిళ స్టార్ హీరో విజయ్ సేతుపతి నటించిన- మహారాజా. కేవలం 25 కోట్ల బడ్జెట్‌తో తీసిన ఈ సినిమా ఇండియాలో 100 కోట్లు రాబట్టింది. చైనాలో 500 కోట్లు పైగా వసూలు చేయాలనే లక్ష్యంతో దీనిని రిలీజ్ చేస్తున్నారు. ఇటీవలి బ్లాక్ బస్టర్లు అయిన కల్కి 2898 AD, యానిమల్, దేవర, కంగువ, సింగం ఎగైన్ ఇవేవీ ఈ కేటగిరీలో లేవు. వీటి స్థానంలో ఒక చిన్న సినిమా చైనా మార్కెట్లో హవా సాగించేందుకు రిలీజ్ బరిలోకి వస్తోంది.
విజయ్ సేతుపతి చిత్రం `మహారాజా` గురించిన చర్చ ఇది. `మహారాజా` నవంబర్ 29న చైనాలో 40వేల స్క్రీన్‌లలో విడుదల కానుంది. చైనాలో అత్యధిక వసూళ్లు చేసిన భారతీయ చిత్రంగా ప్రస్తుతం అమీర్ ఖాన్ `దంగల్` ఖాతాలో రికార్డు ఉంది. ఇది చైనా మార్కెట్‌లో రూ. 1200 కోట్లు వసూలు చేసింది. ఇక అమీర్ ఖాన్ వారసుడు జునైద్ నటించిన `మహారాజా` భారతదేశంలో విడుదలై బాక్సాఫీస్ వద్ద చక్కని వసూళ్లను సాధించింది. ఈ సినిమా కథాంశం గొప్ప ప్రశంసలు అందుకుంది. ఈ చిత్రం ఓటీటీలో అనూహ్య వీక్షణలను అందుకుంది. చైనా ప్రపంచంలోని అతిపెద్ద చలనచిత్ర మార్కెట్లలో ఒకటి. భారతీయ సినిమాలకు అక్కడ గిరాకీ ఉంది. ఈ చిత్రం కేవలం 25 కోట్లతో తెరకెక్కి నాలుగు రెట్లు అధికంగా ఆర్జించింది. మహారాజా బాక్సాఫీస్ వద్ద దాదాపు రూ.106 కోట్లు వసూలు చేసింది. ఇది కల్కి 2898 వంటి భారీ చిత్రంతో పోటీపడుతూ విడుదలైనా చక్కని వసూళ్లను సాధించింది. ఆసక్తికరంగా తెలుగు లోగిళ్లలో మహారాజాకు అంతగా ప్రచారం లేదు కానీ, చైనా రిలీజ్ విషయంలో చాలా జాగ్రత్తలు తీసుకుంటున్నారు. ఇండో- చైనీ సాంస్కృతిక మార్పిడి సెలబ్రేషన్ లా ఈ సినిమాని ప్రచారం చేస్తుండడం ఆసక్తికరం. యి షి ఫిల్మ్స్ ప్రతినిధి అలెక్సీ వూ ఒక ప్రకటనలో మహారాజాను చైనాలో విడుదల చేస్తున్నందుకు తన సంతోషాన్ని వ్యక్తం చేశారు. ఎమోషనల్ కంటెంట్‌తో కూడిన ఆకర్షణీయమైన స్క్రీన్‌ప్లేతో చైనీస్ ప్రేక్షకులను ఆకట్టుకునే చిత్రమిదని ఆయన తెలిపారు.
చైనాలో 40,000 స్క్రీన్లలో భారతీయ సినిమాను విడుదల చేయడం కీలక ఘట్టం కాబోతోంది. సగటున చైనాలో ఒక విజయవంతమైన చిత్రం సాధారణంగా ఒక్కో స్క్రీన్‌కి 1,000 డాలర్ల నుంచి 3,000 డాలర్ల మధ్య సంపాదిస్తుంది. మహారాజా ఒక్కో స్క్రీన్‌కి 2000 డాలర్లు సంపాదించినా, 40,000 స్క్రీన్‌లలో దాని మొత్తం కలెక్షన్ సుమారు 80 మిలియన్ డాలర్లకు చేరుకుంటుంది. అంటే దాదాపు రూ.500 నుంచి రూ.700 కోట్లు వసూలు చేసినట్టు. అయితే ఈ విజయం తొలి రోజు థియేటర్ల నుంచి వచ్చిన మంచి టాక్ ఆధారంగా ఉంటుందని అంచనా. నితిలన్ సామినాథన్ దర్శకత్వం వహించిన `మహారాజా`లో విజయ్ సేతుపతితో పాటు అనురాగ్ కశ్యప్, మమతా మోహన్ దాస్, నటరాజ సుబ్రమణియన్ కూడా కీలక పాత్రల్లో నటించారు.