మొన్నటివరకు ఏదైనా ప్రొడక్టుని ఒక సెలబ్రిటీ ఎండోర్స్ చేస్తే... ఖచ్చితంగా ఈ ప్రొడక్టు కారణంగా ఎవరన్నా వినియోగదారుడికి ఏదైనా అసౌకర్యం కలిగినా.. అలాగే ఎవరికైనా ఎటువంటి కోపం వచ్చినా కూడా సదరు ప్రొడక్టు ప్రకటనలో కనిపించిన సెలబ్రిటీలపై కేసులు వేయడం సర్వసాధరణంగా మారింది. అందుకే మ్యాగీ నూడుల్సు విషయంలో కూడా స్వయంగా అమితాబ్ బచ్చన్ వంటి వారు కేసులు ఎదుర్కొన్నారు.
ఇకపోతే తాజాగా ఆస్క్ మీ బజార్ డాట్ కామ్ అనే వెబ్ సైట్ విషయంలో పెద్ద రచ్చే జరుగుతోంది. ఆన్ లైన్ లో ఎన్నో ఈ-కామర్స్ సైట్లు ఉన్నాయి. అందులో ఈ సైట్ కూడా ఒకటి. కాంపిటీషన్ తట్టుకొనేందుకు ఈ వెబ్ సైట్ వారు ఈ మధ్యనే రణబీర్ కపూర్ - ఫర్షాన్ అక్తర్ లను తమ ప్రచారకర్తలుగా రంగంలోకి దింపారు. వీళ్లు కూడా బీభత్సంగా సైట్ ను ప్రమోట్ చేశారు. ఇంతలో రజత్ భన్సాల్ అనే ఒక లాయర్ గారు.. ఈ సైట్ లో కాస్త చీప్ గా వస్తోందని 30 వేల రూపాయలకు ఒక 40 ఇంచులు ఎల్.ఇ.డి. టివి ఆర్డరు ఇచ్చారట. 10 రోజులైనా ఆర్డరు ఆయనకు రాకపోవడంతో.. బ్యాలెన్సు కూడా కట్ అయిపోయిందని తెలుసుకొని.. ఆయన కేసు ఫైల్ చేశారు.
కట్ చేస్తే.. నమ్మించి మోసం చేసినందుకు ఐపిసి 406.. ఫోర్జరీ అండ్ చీటింగ్ క్రింద ఐపిసి 420 సెక్షన్ లలో రణబీర్ కపూర్ - ఫర్హాన్ అక్తర్ ల పేర్లు మీద ఎఫ్.ఐ.ఆర్. కూడా నమోదైంది. సదరు సైటు ఓనర్లు కాని.. ఈ సెలబ్రిటీలు కాని ఇంకా టచ్ లోకి రాలేదట.. వారంలోపు టచ్ లోకి రాకపోతే కోర్టు ద్వారా నోటీసులు అందించే ఛాన్సుంది. చూద్దాం కేసు ఎటు మలుపు తిరుగుతుందో...