ప్రముఖులు నివసించే ఇళ్లు భద్రంగా ఉంటాయనుకుంటాం.కానీ.. అందరి మాదిరి అప్పుడప్పుడు వారిల్లు కూడా ప్రమాదానికి గురి అవుతుంటాయి. కొందరు ప్రముఖుల ఇళ్లల్లో చోరీలు జరుగుతుంటాయి. ఇదే కోవలో తాజాగా బాలీవుడ్ ప్రముఖ నటి ఐశ్వర్యారాయ్ బచ్చన్ నివాసంలో ఈ మధ్యహ్నం అగ్నిప్రమాదం చోటు చేసుకుంది.
ముంబయిలోని బాంద్రాలో లామెర్ రెసిడెన్షియల్ భవనంలోని 13వ అంతస్తులో ఐష్ ఒకప్పుడు నివాసం ఉండేవారు. ఇప్పుడు ఆమె పేరెంట్స్ ఉండేవారు. గత ఏడాది మార్చిలో ఐశ్వర్య తండ్రి ఇదే ఇంట్లో ఉండి మరణించారు. ఆ తర్వాత నుంచి ఆమె తల్లి అక్కడే ఉంటున్నారు. ఈ రోజు మధ్యాహ్నం 12.50 గంటల వేళలో 13వ అంతస్తు నుంచి మంటలు ఎగిసి పడ్డాయి. దీంతో.. అగ్నిమాపక శాఖకు సమాచారం అందించారు. హుటాహుటిన వచ్చిన అధికారులు మంటల్ని అదుపు చేసే ప్రయత్నం చేశారు.
అదే సమయంలో అపార్ట్ మెంట్లో నివాసం ఉంటున్న మిగిలిన వారిని భవనం నుంచి ఖాళీ చేయించారు. ఈ అపార్ట్ మెంట్లోనే ఒకప్పుడు క్రికెట్ దేవుడు సచిన్ టెండుల్కర్ ఉండేవారు. తాజా అగ్నిప్రమాదంలో ఎవరూ గాయపడలేదు. అగ్నిప్రమాదానికి కారణం ఏమిటన్న అంశంపై అధికారులు ఆరా తీస్తున్నారు.