అందాల రాక్షసి సినిమాతో హీరోయిన్ గా పరిచయం అయిన లావణ్య త్రిపాఠి ఆ తర్వాత చాలా సినిమాల్లో నటించి తన నటన మరియు అందంతో ఆకట్టుకుంది. కాని ఇప్పటి వరకు ఆమెకు స్టార్ డమ్ మాత్రం దక్కలేదు. స్టార్ హీరోల సినిమాల్లో ఆమెకు ఆఫర్ అందని ద్రాక్ష అయ్యింది. తెలుగు లో ఈమె నటించిన సినిమాలు ఈమెకు హీరోయిన్ గా గుర్తింపు తెచ్చిపెట్టినా స్టార్ ను చేయలేక పోయాయి. అయితే లావణ్య త్రిపాఠికి ఎప్పుడు కూడా ఆఫర్లకు లోటు లేదు అన్నట్లుగానే ఉంది. ప్రస్తుతం కూడా ఈమె రెండు మూడు సినిమాలు చేస్తూనే ఉంది. ఈ ఏడాది ఇప్పటికే రెండు సినిమాలతో ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఆ రెండు సినిమాలు కూడా కమర్షియల్ గా నిరాశ పర్చాయి.
లావణ్య త్రిపాఠి హీరోయిన్ గా తెలుగు లో హ్యాపీ బర్త్ డే అనే సినిమా రూపొందుతోంది. నేడు ఆమె పుట్టిన రోజు సందర్బంగా చిత్ర యూనిట్ సభ్యులు హ్యాపీ బర్త్ డే సినిమా పోస్టర్ ను రివీల్ చేయడం జరిగింది. పోస్టర్ విడుదల తర్వాత సినిమా పై అంచనాలు ఆసక్తి పెరిగింది. అందమైన లావణ్య చేతిలో అతి పెద్ద మిషన్ గన్ ఉంది. ఆ గన్ ను పేల్చుతున్నట్లుగా లావణ్య ఫోజ్ ఇచ్చింది. నో గన్ నో ఎంట్రీ అంటూ కూడా పోస్టర్ లో ఒక బోర్డ్ కనిపిస్తుంది. థైస్ ఎక్స్ పోజ్ చేస్తూ గన్ చేతిలో పట్టుకున్న లావణ్య త్రిపాఠి ఏం చెప్పబోతుందా అంటూ అందరిలో ఆసక్తి కనిపిస్తుంది. ఈమద్య కాలంలో హీరోయిన్ ఓరియంట్ చిత్రాలు తెలుగు ప్రేక్షకుల ముందుకు వరుసగా వస్తున్నాయి. అందులో ఎక్కువ శాతం నిరాశ పర్చాయి. మరి ఈ సినిమా ఫలితం ఎలా ఉంటుందా అనేది చూడాలి.
ఇక ఈ సినిమా ను పాన్ తెలుగు సినిమా అంటూ పోస్టర్ మీద వేసి అందరిని ఆశ్చర్యపర్చుతున్నారు. అదేంటి పాన్ ఇండియా మూవీ.. పాన్ వరల్డ్ మూవీ విన్నాం కాని ఈ పాన్ తెలుగు మూవీ ఏంటో అంటూ కొత్త చర్చ కు తెర తీశారు. పోస్టర్ కింది బాగంలో కూడా తెలుగు నే అన్ని భాషల్లో పెట్టారు. దీని వెనుక ఏదైనా ప్రత్యేకత ఉందా లేదంటే ఫన్ కోసం ఇలా చేశారా అనేది తెలియాలంటే సినిమా వచ్చే వరకు ఆగాల్సిందే. ఈ సినిమా నిర్మాణంలో మైత్రి మూవీ మేకర్స్ వారి హస్తం ఉండటం వల్ల సినిమా పై అంచనాలు ఇండస్ట్రీ వర్గాల వారిలో ఆసక్తి నెలకొంది. ఈ సినిమా ను క్లాప్ బోర్డ్ వారితో కలిసి మైత్రి మూవీస్ వారు నిర్మిస్తున్నారు.