నేచురల్ స్టార్ నాని తన 'వాల్ పోస్టర్ సినిమా' పతాకంపై నాలుగో చిత్రం ప్రకటించిన విషయం తెలిసిందే. నాని సమర్పణలో ప్రశాంత్ తిపిర్నేని నిర్మిస్తున్న ఈ చిత్రానికి ''మీట్ క్యూట్'' అనే టైటిల్ ను ఖరారు చేశారు. సోమవారం హైదరాబాద్ లో ఈ సినిమాని లాంఛనంగా ప్రారంభించారు. ‘అ!’ సినిమాతో ప్రశాంత్ వర్మ.. ‘హిట్’ తో శైలేష్ కొలను వంటి టాలెంటెడ్ డైరెక్టర్స్ ను పరిచయం చేసిన నాని.. ఇప్పుడు తన సోదరి దీప్తీ ఘంటా ను దర్శకురాలిగా ఇంట్రడ్యూస్ చేస్తున్నారు.
''మీట్ క్యూట్'' ఒక మహిళా ప్రధానంగా సాగే కంటెడ్ బేస్డ్ మూవీ అని తెలుస్తోంది. క్రేజీ మల్టీస్టారర్ గా రూపొందుతున్న ఈ చిత్రంలో కొంతమంది ప్రముఖ హీరోయిన్లు ప్రధాన పాత్రల్లో నటించనున్నారని నాని వెల్లడించారు. అయితే తాజాగా వినిపిస్తున్న టాక్ ప్రకారం ఇందులో హీరోలు ఉండరని.. ఐదుగురు హీరోయిన్లు ఉంటారని తెలుస్తోంది. వారిలో ముగ్గురు పాపులర్ హీరోయిన్లు కాగా.. మరో ఇద్దరు అప్ కమింగ్ హీరోయిన్లు ఉంటారని అంటున్నారు.
హీరోయిన్ల వివరాలు త్వరలో వెల్లడిస్తానని ప్రకటించిన నాని.. ఒక్కొక్కరి పేరు ఒక్కో సందర్భంలో ప్రకటించేలా ప్లాన్ చేసుకుంటున్నారని తెలుస్తోంది. అందుకే నటుడు సత్యరాజ్ పై క్లాప్ కొట్టి, హీరోయిన్ ఫేస్ కనిపించకుండా ఫోటోలు బయటకు వదిలారు. ఇక 'మీట్ క్యూట్' చిత్రాన్ని వీలైనంత త్వరగా కంప్లీట్ చేసేలా ప్లాన్ చేసుకున్న చిత్ర బృందం.. 30 రోజుల్లో టాకీ పార్ట్ పూర్తి చేయనున్నారని టాక్. ఈ చిత్రానికి విజయ్ బుల్గానిన్ సంగీతం సమకూరుస్తున్నారు. వసంత కుమార్ సినిమాటోగ్రఫీ అందిస్తుండగా.. గ్యారీ బిహెచ్ ఎడిటింగ్ వర్క్ చేస్తున్నారు.