ప్రస్తుతం ఏ సినిమాకైనా మొదటి మూడు - నాలుగు రోజుల కలెక్షన్స్ చాలా ముఖ్యం. ఇప్పుడు తెలంగాణలో రోజుకు ఐదు ఆటలు ప్రదర్శించేందుకు అనుమతులు ఇస్తే.. నైజాం ఏరియాలో బిజినెస్ ఒక్కసారిగా 25 శాతం పెరుగుతుంది. కలెక్షన్స్ కూడా అదే రేంజ్ లో పెరిగే ఛాన్స్ ఉంది. దీనికి అతి త్వరలోనే గ్రీన్ సిగ్నల్ రానుందని అంటున్నారు.
రీసెంట్ గా పవన్ కళ్యాణ్ తెలంగాణ ప్రభుత్వాన్ని - కేటీఆర్ ను - హరీష్ రావును ప్రత్యేకంగా అభినందించాక ఈ వార్తలు రావడంతో.. సర్దార్ గబ్బర్ సింగ్ కోసమే ఈ ప్రతిపాదనలు పట్టాలెక్కిస్తున్నారనే వాదనలు వినిపిస్తున్నాయి. ఏప్రిల్ 8న సర్దార్ గబ్బర్ సింగ్ విడుదల అవుతోంది. ఈ లోపుగానే తెలంగాణ సర్కార్ ఆదేశాలు జారీ చేసే ఛాన్స్ ఉందట. ఇదే కనక జరిగితే.. కలెక్షన్స్ విషయంలో పవన్ ప్రస్తుతం ఉన్న రికార్డులన్నీ బద్దలు కొట్టేసే అవకాశాలు పుష్కలంగా ఉన్నాయి.
అత్తారింటికి దారేది చిత్రంతో పవన్ రికార్డులన్నీ తిరగరాసేశాడు. కానీ బాహుబలి - శ్రీమంతుడు ఈ రికార్డును దటేశాయి. ఇందుకు కారణం.. టికెట్ రేట్లు పెరగడం, తొలివారం ఫ్లాట్ రేటుకు విక్రయించుకునే అవకాశం ఇవ్వడమే. ఇప్పటివరకూ పవన్ సినిమాకు ఇలా కలిసొచ్చిన సందర్భం ఏదీ లేదు. కానీ ఇప్పుడు తెలంగాణ ప్రభుత్వంతో పవన్ కి సయోధ్య కుదురుతోందనే టాక్ ఉంది. ఇందుకు గాను బీజేపీ నేతలు తెరవెనక మంత్రాంగం నడిపించారని అంటున్నారు. తెలంగాణలో ఇది సాధ్యమైతే.. ఏపీలోనూ సేమ్ సీన్ రిపీట్ అయ్యే అవకాశాలున్నాయి. అక్కడ అధికారపక్షానికి పవన్ కళ్యాణ్ ఎలాగూ మిత్రపక్షమే కదా.