ప్రేక్షకులు ఏ సినిమాని హిట్ చేస్తారో ఏ సినిమాని ప్లాప్ చేస్తారో సినీ పండితులు కూడా చెప్పలేరు. అలానే థియేటర్ లో చూడని సినిమాలు టీవీలలో విపరీతంగా ఎందుకు చూస్తారో కూడా చెప్పలేం. ఎందుకనో ఆడియెన్స్ కొన్ని కథల్ని రిజెక్ట్ చేసి సినిమాలని థియేటర్లలో నడిచే అవకాశం ఇవ్వరు. అవే ప్లాప్ టాక్ తెచ్చుకుని జనాల ఆదరణ కరువైన సినిమాలు చాలా వరకు బుల్లితెరపై రాణించాయి. హయ్యెస్ట్ టీఆర్పీ రేటింగ్స్ సాధిస్తూ ఆడియెన్స్ ని ఎట్రాక్ట్ చేశాయి. 'ఖలేజా' 'అతడు' 'హ్యాపీ' 'ఎలా చెప్పను' 'ఒంగోలు గిత్త' 'ఆరెంజ్' 'బ్లఫ్ మాస్టర్'.. ఇలా చెప్పుకుంటూ పోతే చాలా సినిమాలే ఉన్నాయి. ఇప్పుడు అదే జాబితాలోకి 'చావు కబురు చల్లగా' సినిమా కూడా చేరింది.
మెగా ప్రొడ్యూసర్ అల్లు అరవింద్ సమర్పణలో గీతా ఆర్ట్స్ 2 బ్యానర్ పై బన్నీ వాస్ నిర్మించిన 'చావు కబురు చల్లగా' సినిమా మార్చి 19న థియేటర్లలోకి వచ్చింది. పెగళ్ళపాటి కౌశిక్ అనే కొత్త దర్శకుడు తెరకెక్కించిన ఈ చిత్రంలో కార్తికేయ - లావణ్య త్రిపాఠి హీరోహీరోయిన్లుగా నటించారు. అయితే మొదటి ఆట నుంచే ఈ సినిమాకి మిశ్రమ స్పందన వచ్చింది. చిన్న వయసులోనే భర్త చనిపోయిన అమ్మాయిని ఓ యువకుడు ప్రేమలో పడేయడం అనే వినూత్నమైన కాన్సెప్ట్ ని ఎందుకో తెలుగు ఆడియన్స్ యాక్సెప్ట్ చేయలేదు. అయితే థియేటర్ లో ఫ్లాప్ టాక్ తెచ్చుకున్న ఈ చిత్రాన్ని ఓటీటీలో రిలీజ్ చేస్తే మంచి ఆదరణ తెచ్చుకుంటున్నట్లు తెలుస్తోంది.
తెలుగు డిజిటల్ ఫ్లాట్ ఫార్మ్ 'ఆహా' లో ''చావు కబురు చల్లగా'' చిత్రాన్ని ఇటీవలే స్ట్రీమింగ్ కి పెట్టారు. ఈ సినిమా మంచి వ్యూయర్ షిప్ సంపాదించుకుంటూ దూసుకెళ్తుందని స్వయంగా 'ఆహా' వారే చెబుతున్నారు. 72 గంటల్లో 100 మిలియన్ మినిట్స్ వ్యూయర్ షిప్ కూడా అందుకున్నట్లుగా వెల్లడించారు. అయితే థియేటర్ లో ఆడియెన్స్ చూసిన వెర్షన్ కి ఇప్పుడు 'ఆహా'లో అప్లోడ్ చేసిన సినిమాకి చాలా తేడా ఉందని అంటున్నారు. ఓటీటీ ఆడియన్స్ కోసం 'చావు కబురు చల్లగా' చిత్రాన్ని కొత్తగా ఎడిట్ చేసి విడుదల చేయడంతో.. దీనిని ఫ్యామిలీ ఆడియన్స్ మెచ్చి హిట్ చేసినట్లు తెలుస్తోంది.