ప్రపంచంలోనే అత్యంత ఖరీదైన విడాకులివీ..

Update: 2020-02-13 09:30 GMT
పెళ్లంటే పండుగ.. మరీ విడాకులంటే.. అది మన జీవితంలోనే అత్యంత బాధకరమైన ఘటన.. అనుభవించినవారికే తెలుస్తుందిదీ.. అయితే విడాకులను కూడా పండుగలా చేసుకుంటారు బడాబాబులు.. భార్య నుంచి విడిపోవడానికి ఏకంగా 280 కోట్ల పరిహారాన్ని ఇచ్చాడు మాజీ క్రికెటర్ మైకేల్ క్లార్క్. ఆయనకు భార్యపై ఎంత ద్వేషం.. విడిపోవాలన్న కసి ఉందో ఆ పరిహారాన్ని చూస్తే తెలుస్తోందని సెటైర్లు వేస్తున్నారు నెటిజన్లు..

పోనీలే.. వేరే ఎవరైనా కత్తిలాంటి అమ్మాయి దొరికిందో.. ప్రస్తుత భార్యతో క్లార్క్ కు పొసగలేదో.. ఇంక ఏదో బాధ ఉందో కానీ మొత్తానికి భార్య కైలీ నుంచి విడిపోయాడట మైకేల్ క్లార్క్.  వీరికి తాజాగా విడాకుల ధ్రువీకరణ అయినట్టుగా మీడియాలో వార్తలు వచ్చాయి. ప్రపంచంలోనే అత్యంత భారీ పరిహారాన్ని ఇచ్చిన క్రికెటర్ గా మైకేల్ క్లార్క్ గుర్తింపు పొందారు.

ఆస్ట్రేలియా క్రికెట్ జట్టు కెప్టెన్ గా మైకేల్ క్లార్క్ సుపరిచితులే.. పాంటింగ్ వరుస వరల్డ్ కప్ లు అందించి ఆస్ట్రేలియాను ప్రపంచ క్రికెట్ లో రారాజుగా నిలిపితే ఆయన తర్వాత ఆస్ట్రేలియాకు మరో ప్రపంచకప్ ను అందించాడు క్లార్క్. ఆటగాడిగా, కెప్టెన్ గా గుర్తింపు పొందాడు. ప్రపంచ క్రికెట్ లో ఆస్ట్రేలియా ఆధిపత్యపు చివరి జట్టుకు కెప్టెన్ క్లార్క్ నే..

తాజాగా అలాంటి క్లార్క్ తన భార్య కైలీతో ఏడేళ్ల వివాహ బంధాన్ని తెంచుకున్నాడు. టీవీ యాంకర్ అయిన కైలీని క్లార్క్ ఏడేళ్ల కిందట వివాహం చేసుకున్నాడు. వీరికి ఒక కూతురు. విడాకుల కోసం భార్యకు ఏకంగా 280 కోట్ల రూపాయల పరిహారాన్ని ఇచ్చాడని మీడియాలో వార్తలు వచ్చాయి.  ఇలా ప్రపంచంలోనే అత్యంత ఖరీదైన విడాకులు తీసుకున్న  జంటగా    మాజీ క్రికెటర్ క్లార్క్-కైలీకి పేరు వచ్చింది.


Tags:    

Similar News