ఓటీటీల్లో సినిమా చూడాలంటే మెంబర్ షిప్ ఉండాలి. కొన్నిటిని పే-పర్ వ్యూలో చూడాలి. కానీ నాగబాబు యూట్యూబ్ లో ఇక ప్రతిదీ ఫ్రీగానే చూడొచ్చట. మునుముందు 8-9 ఎపిసోడ్లతో ఒక వెబ్ సిరీస్ ని ఉచితంగా మెగా బ్రదర్ యూట్యూబ్ లో రిలీజ్ చేసేస్తున్నారట. ఆ విషయాన్ని ఆయనే స్వయంగా వెల్లడించారు. ఇక ఈ వెబ్ సిరీస్ ని అదిరింది టీమ్ తోనే తీస్తున్నారట. స్టేజ్ మీద గల్లీ బాయ్స్.. రౌడీ బాయ్స్ అంటూ స్కిట్స్ చేసిన కుర్రాళ్లతోనే ఈ సిరీస్ తెరకెక్కుతుండడంతో ఇండస్ట్రీలో ఆసక్తి నెలకొంది.
బస్తీ బాయ్స్ వెబ్ సిరీస్ గురించి నాగబాబు మాట్లాడుతూ ``సద్దాం-యాదమ్మ రాజు-భాస్కర్ - హరి (అదిరింది టీమ్) కలిస్తే కామెడీ బావుంటుందని ఆ నలుగురితో బస్తీ బాయ్స్ అనే వెబ్ సిరీస్ నిర్మించాం. తాము ఇన్ఫినిటం తో కలిసి ఈ సిరీస్ తీస్తున్నాం. ఈ కంటెంట్ ఏ OTT కి వెళ్లినా డిమాండ్ బావుంటుంది. కాకపోతే ఇది అందరికి అందించాలనే ఉద్దేశంతో ఎలాంటి సబ్ స్క్రిప్షన్ చార్జెస్ లేకుండా నా యూ ట్యూబ్ ఛానెల్ అయిన `నాగబాబు ఒరిజినల్స్`లో రిలీజ్ చేస్తున్నాం. ఈ సిరీస్ కి టీవీ లానే చాలా ఎక్కువ ఖర్చు చేసి తీసాం. సిరీస్ హిట్ అయితే మరిన్ని సీజన్స్ చేసే ఆలోచనలో ఉన్నాం. ఈ సిరీస్ కి కాన్సెప్ట్ నేను బుల్లెట్ భాస్కర్ కలిసి తయారు చేసుకున్నాం. బుల్లెట్ భాస్కర్ డైరెక్ట్ చేసాడు`` అని చెప్పారు.
ఈ సందర్భంగా సద్దాం- హరి- రాజు భాస్కర్ పై ప్రశంసలు కురిపించారు నాగబాబు. ఈ వెబ్ సిరీస్ ఈ నెల 27 సాయంత్రం 6 గంటల నుండి అందుబాటులో ఉంటుంది అని చెప్పారు.