ఫ్ట్ర‌స్ట్రేట్ అవుతున్న స్టార్ హీరో ఫ్యాన్స్‌?

Update: 2022-09-15 00:30 GMT
యంగ్ టైగ‌ర్ ఎన్టీఆర్, మెగా ప‌వ‌ర్ స్టార్ రామ్ చ‌ర‌ణ్‌ 'RRR' తో వ‌ర‌ల్డ్ వైడ్ గా రికార్డు స్థాయి విజ‌యాన్ని సొంతం చేసుకున్నారు. అంతే కాకుండా భారీ స్థాయిలో పాపులారిటీని కూడా ద‌క్కించుకున్నారు. త్వ‌ర‌లో ఈ మూవీ ఆస్కార్ బ‌రిలోనూ నిల‌వ‌నుంద‌ని వార్త‌లు వస్తున్న విష‌యం తెలిసిందే. నెట్ ఫ్లిక్స్ లో రిలీజ్ అయితే త‌రువాత ఈ మూవీకి మ‌రింత క్రేజ్ పెరిగింది. హాలీవుడ్ స్టార్స్‌, డైరెక్ట‌ర్స్‌, రైట‌ర్స్ ఈ మూవీపై ప్ర‌శంస‌ల వ‌ర్షం కురిపిస్తున్నారు.

ఇదిలా వుంటే ఈ మూవీతో వ‌చ్చిన క్రేజ్ ని క్యాష్ చేసుకుంటూ రామ్ చ‌ర‌ణ్ ..స్టార్ డైరెక్ట‌ర్ శంక‌ర్ డైరెక్ష‌న్ లో త‌న 15వ ప్రాజెక్ట్ ని ప్రారంభించేశాడు. కీల‌క ఘ‌ట్టాల షూటింగ్ కూడా పూర్త‌యింది. త్వ‌ర‌లో తాజా షెడ్యూల్ ప్రారంభం కాబోతోంది. అయితే యంగ్ టైగ‌ర్ ఎన్టీఆర్ మాత్రం ఇంత వ‌ర‌కు త‌ను ప్ర‌క‌టించిన 30వ ప్రాజెక్ట్ ని ప‌ట్టాలెక్కించలేక‌పోయాడు. 'RRR' త‌రువాత ఎన్టీఆర్ స్టార్ డైరెక్ట‌ర్ కొర‌టాల శివ‌తో ఓ భారీ పాన్ ఇండియా ప్రాజెక్ట్ ని తెర‌పైకి తీసుకురాబోతున్న‌ట్టుగా ప్ర‌క‌టించిన విష‌యం తెలిసిందే.

ఇది ఎన్టీఆర్ 30వ ప్రాజెక్ట్. ఎన్టీఆర్ ఆర్ట్స్ నంద‌మూరి క‌ల్యాణ్ రామ్ స‌మ‌ర్ప‌ణ‌లో యువసుధా ఆర్ట్స్ బ్యాన‌ర్ పై సుధాక‌ర్ మిక్కినేని ఈ ప్రాజెక్ట్ ని నిర్మించ‌బోతున్నారు. ఎన్టీఆర్ బ‌ర్త్ డే సంద‌ర్భంగా మే 20న ఈ మూవీ డైలాగ్ మోష‌న్ పోస్ట‌ర్ ని విడుద‌ల చేశారు. 'వ‌స్తున్నా..' అంటూ ఎన్టీఆర్ చెప్పిన డైలాగ్ తో రిలీజ్ చేసిన మోష‌న్ పోస్ట్ తో ఫ్యాన్స్ ఫుల్ హ్యాపీ ఫీల‌య్యారు. అయితే ఆ ఆనందం ఎంతో సేపు నిల‌వ‌లేదు. ఈ ప్రాజెక్ట్ ప్ర‌క‌టించి నెల‌లు గ‌డుస్తున్న మేక‌ర్స్‌, ద‌ర్శ‌కుడు కొర‌టాల శివ అదుగో ఇదుగో అంటుండ‌టంతో మ‌రింత‌గా ఆల‌స్యం అవుతూ వ‌స్తోంది.

దీంతో ఎన్టీఆర్ ఫ్యాన్స్ ఫ్ట్ర‌స్ట్రేట్ అవుతున్నార‌ట‌. సెప్టెంబ‌ర్ లో మొద‌ల‌వుతుంద‌ని భావించినా ఈ నెల‌లో కూడా ఈ మూవీ సెట్స్ పైకి వ‌చ్చే అవ‌కాశాలు లేక‌పోవ‌డంతో సోష‌ల్ మీడియా వేదిక‌గా మేక‌ర్స్ ని ఫ్యాన్స్ నిల‌దీస్తున్నార‌ట‌.

ఎన్టీఆర్ 30పై అప్ డేట్ ఇవ్వ‌మంటూ నెట్టింట హంగామా చేస్తున్నార‌ట‌. ఇదే త‌ర‌హాలో ఎన్టీఆర్ ప్రాజెక్ట్ ఆల‌స్య‌మైతే  'RRR'తో ఎన్టీఆర్ కు ఏర్ప‌డిన క్రేజ్ ని క్యాష్ చేసుకోలేమ‌ని వాపోతున్నార‌ట‌. ఇప్ప‌టికైనా ఈ ప్రాజెక్ట్ ని మొద‌లు పెట్టండ‌ని మేక‌ర్స్ కి హిత‌బోధ చేస్తున్నార‌ట‌.  

అయితే ఫ్యాన్స్ సోష‌ల్ మీడియా వేదిక‌గా చేస్తున్న హంగామాపై మేక‌ర్స్ నుంచి మాత్రం ఎలాంటి స్పంద‌న క‌నిపించ‌డం లేదు. దీంతో #NTR30 వ‌చ్చే నెల అయినా సెట్స్ పైకి వెళ్లేనా అని ఫ్యాన్స్ తీవ్ర ఆందోళ‌న‌కు గుర‌వువున్నార‌ట‌. మేక‌ర్స్ స్పందించేంత వ‌ర‌కు #NTR30 ఎప్పుడు ప‌ట్టాలెక్కుతుంద‌నే విష‌యంలో స్ప‌ష్ట‌త రావ‌డం క‌ష్ట‌మే అనే కామెంట్ లు వినిపిస్తున్నాయి.


నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.
Tags:    

Similar News