పూనమ్ కౌర్ ఒకప్పుడు వరుస సినిమాలతో ఇండస్ట్రీలో చాలా బిజీగా కనిపించింది. కానీ ఇటీవల కాలంలో మాత్రం ఆమె కాంట్రవర్సీ వంటి టాపిక్స్ తో వార్తల్లో నిలుస్తోంది. అప్పట్లో గోపిచంద్ శౌర్యం సినిమాలో ఆమె సిస్టర్ పాత్రలో నటించి మంచి గుర్తింపును అందుకుంది. ఇక గగనం, గణేష్ వంట చిత్రాలతో తెలుగు ప్రేక్షకులకు ఆమె దగ్గరయ్యింది. ఇక ఇటీవల అమె ఒక అరుదైన వ్యాధి బారిన పడినట్లు వార్తలు వచ్చిన విషయం తెలిసిందే. ఇక ఆమె ఎందుకు ఆ వ్యాధి బారిన పడాల్సి వచ్చింది అనే వివరాల్లోకి వెళితే.
రాజకీయ నాయకురాలిగా కూడా కొనసాగుతున్న పూనమ్ కౌర్ నటి ఆరోగ్య పరిస్థితిపై అనేక రకాల కథనాలు వెలువడుతున్నాయి. ఇక పాలిటిక్స్ లో ఆమె చురుగ్గా పాల్గొనే ప్రయత్నం చేస్తున్న విషయం తెలిసిందే. జీరో జీఎస్టీ ఉద్యమంలో పూనమ్ కౌర్ ఏడాది కాలంగా పాల్గొంది. నవంబర్ 10వ తేదీన, సూరత్‌లోని ఇందిరా పార్కులో చేనేత వస్త్రాలపై జిఎస్‌టిని రద్దు చేయాలని చేనేత కార్మికులు నిర్వహించిన నిరసన కార్యక్రమంలో రాజకీయ నాయకురాలిగా పాల్గొన్నారు.
ఇక 11వ తేదీన సబర్మతీ ఆశ్రమంలో మౌన నిరసనలో పాల్గొన్న అనంతరం 12వ తేదీన ఢిల్లీలో జరిగిన బ్రహ్మకుమారి సమావేశానికి ఆమె శ్రీకారం చుట్టారు. అయితే అక్కడ ఆమెకు వెన్నునొప్పి రావడంతో కేరళ వెళ్లింది. అప్పుడు కొన్ని పరీక్షల అనంతరం ఆమెకు ఫైబ్రోమైయాల్జియా అనే వ్యాధి ఉన్నట్లు తేలింది. కేరళలో చికిత్స తీసుకున్న ఆమె ప్రస్తుతం మహారాష్ట్రలో విశ్రాంతి తీసుకుంటోంది. ఆమె బాగానే ఉందని బంధువులు చెబుతున్నారు.
ఇక పూనమ్ కౌర్ ఇటీవల కాలంలో ఎక్కువగా రాజకీయాలకు సంబంధించిన వార్తలతో వైరల్ గా మారుతోంది. ఆ మధ్య రాహుల్ గాంధీ జోడో యాత్రలో కూడా ఆమె కలిసి పాద యాత్రలో పాల్గొంది. ఇక రాహుల్ ఆమె చెయ్యి పట్టుకోవడంతో ఆ ఫొటోలు కూడా సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. అనవసరంగా ఆ ఫొటోపై ట్రోల్స్ చేయడం కరెక్ట్ కాదని తాను పడిపోతుంటే రాహుల్ పట్టుకున్నట్లు ఆమె చెప్పారు.
నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.