పూర్తి సమయం 'శాకుంతలం'కేనా? సామ్ ఉద్దేశ్యం ఏంటీ?

Update: 2021-03-19 04:31 GMT
పెళ్లి తర్వాత కూడా సమంత వరుసగా సినిమాలు చేస్తున్న నేపథ్యంలో అభిమానులు ఆనందం వ్యక్తం చేశారు. వరుసగా సినిమాలు చేస్తున్న ఆమెకు కరోనా రూపంలో బ్రేక్‌ వచ్చింది. ఆ బ్రేక్‌ ను సమంత అలాగే కంటిన్యూ చేస్తున్నట్లుగా అనిపిస్తుంది. గత ఏడాది కాలంగా సమంత కమిట్ అయిన కొత్త ప్రాజెక్ట్‌ లు ఆమె అభిమానులకు నిరాశ కలిగిస్తున్నాయి. గతంలో ఏడాదికి నాలుగు అయిదు సినిమాలు చేసిన సమంత ఇప్పుడు మాత్రం ఆచి తూచి అన్నట్లుగా సినిమాలు ఎంపిక చేస్తుంది. తెలుగులో దాదాపు ఏడాది తర్వాత శాకుంతలం సినిమా కు కమిట్‌ అయ్యింది. ఆఫర్లు రావడం లేదా అంటే అదేమి కాదు. ఆమె వద్దకు రెగ్యులర్ గా స్క్రిప్ట్‌ లు వస్తూనే ఉన్నాయట.

చైతూతో పెళ్లి తర్వాత బాధ్యతలు పెరిగిన కారణంగా పాత్రకు ప్రాముఖ్యత ఉన్న సినిమాలను చేసేందుకు ముందుకు వస్తుంది. తమిళంలో నయన్‌ తో కలిసి విఘ్నేష్‌ శివన్ దర్శకత్వంలో ఒక సినిమాను చేసిన సమంత ఇటీవల తెలుగులో శాకుంతలం సినిమా చేస్తోంది. శాకుంతలం కు సమంత ఆరు నెలల డేట్లు ఇచ్చిందనే సమాచారం అందుతోంది. ఆ సినిమా పూర్తి అయ్యే వరకు సమంత కొత్త సినిమాలకు కమిట్ అవ్వకూడదని భావిస్తుందట.

నందిని రెడ్డితో ఇప్పటికే కమిట్ అయిన సినిమాను కూడా వచ్చే ఏడాదికి పోస్ట్‌ పోన్‌ చేసినట్లుగా వార్తలు వస్తున్నాయి. శాకుంతలం కోసం సమంత ఇతర ప్రాజెక్ట్‌ లను వద్దనుకుంటుందా లేదంటే మరేదైనా కారణం వల్ల సమంత తన వద్దకు వచ్చిన ప్రాజెక్ట్‌ లను తిరష్కరిస్తుందా అనేది తెలియాల్సి ఉంది. మొత్తానికి సమంత ఈ ఏడాది మొత్తం కూడా శాకుంతలం తప్ప మరే సినిమాను చేయదని ఆమె సన్నిహితుల ద్వారా సమాచారం అందుతోంది. సమంత నిర్ణయం పట్ల అభిమానులు ఒకింత అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. సామ్ వరుసగా సినిమాలు చేయాలని వారు కోరుకుంటున్నారు.
Tags:    

Similar News