సక్సెస్ ఫుల్ డైరెక్టర్ అనిల్ రావిపూడి దర్శకత్వ పర్యవేక్షణతోపాటు స్క్రీన్ ప్లేకూడా అందించిన చిత్రం ‘గాలి సంపత్’. రాజేంద్ర ప్రసాద్, శ్రీవిష్ణు వంటి కాస్టింగ్ తోడవడంతో ఈ మూవీపై మంచి అంచనాలు నెలకొన్నాయి. శివరాత్రి సందర్భంగా విడుదలైన జాతిరత్నాలు, శ్రీకారం చిత్రాలకు ఏ మాత్రం తీసిపోకుండా హైప్ తెచ్చుకుందీ చిత్రం. కానీ.. ఫలితం మాత్రం ఎవరూ ఊహించని విధంగా రావడం ఆశ్చర్యానికి గురిచేస్తోంది!
ఈ సినిమాను మొదటి రోజు తర్వాత చాలా థియేటర్లలోంచి తీసేశారంటే పరిస్థితి ఎలా ఉందో అర్థం చేసుకోవచ్చు. రెండు తెలుగు రాష్ట్రాల్లోనూ ఇదే పరిస్థితి నెలకొంది. దీంతో.. ఈ చిత్రం కలెక్షన్లు దారుణంగా పడిపోయాయి. రూ.7 కోట్ల బ్రేక్ ఈవెన్ టార్గెట్ తో విడుదలైన ఈ సినిమా కనీస స్థాయిలో కూడా కలెక్షన్స్ రాబట్టలేకపోయిందని సమాచారం.
జాతిరత్నాలు సూపర్ హిట్ టాక్ తెచ్చుకోవడం.. శ్రీకారం కూడా బాక్సాఫీస్ వద్ద ప్రతాపం చూపేందుకు ప్రయత్నిస్తుండడంతో గాలిసంపత్ సినిమాను చూసేవారు కరువయ్యారని తెలుస్తోంది. బిలో యావరేజ్ కన్నా దారుణంగా పరిస్థితి ఉందంటున్నారు ఎక్స్ పర్ట్స్. దీంతో.. ఈ చిత్రం భారీ నష్టాలను చవిచూసే పరిస్థితి వచ్చిందని అంటున్నారు ట్రేడ్ పండితులు.