అమెరికాలో తడబడిన గద్దలకొండ!

Update: 2019-09-26 07:45 GMT
మెగా హీరో వరుణ్ తేజ్ కొత్త సినిమా 'గద్దలకొండ గణేష్' కు అటు రివ్యూయర్ల నుండి ఇటు ఆడియన్స్ నుండి మంచి రెస్పాన్సే వచ్చింది.  మాస్ ఆడియన్స్ కు వరుణ్ తేజ్ పాత్ర కనెక్ట్ కావడంతో తెలుగు రాష్ట్రాల్లో కలెక్షన్స్ డీసెంట్ గా ఉన్నాయి.  త్వరలోనే బ్రేక్ ఈవెన్ అయ్యే అవకాశాలు కూడా ఉన్నాయి. అయితే అమెరికాలో మాత్రం పరిస్థితి అనుకూలంగా లేదు.

'గద్దలకొండ గణేష్' బ్రేక్ ఈవెన్ కావాలంటే $600K మార్క్ దాటాల్సి ఉంది.  అయితే ఇప్పటివరకూ వరుణ్ తేజ్ సినిమా వసూలు చేసింది $374K మాత్రమే.  అమెరికా కలెక్షన్స్ ఎప్పుడూ ఓపెనింగ్స్ పైనే ఆధారపడి ఉంటాయి.  కానీ ఈ సినిమా మాస్ సినిమాగా ప్రొజెక్ట్ చేయడంతో అమెరికా ఆడియన్స్ పెద్దగా ఆసక్తి చూపలేదు.  యూఎస్ లో ఎక్కువ శాతం క్లాస్ ఆడియన్స్ కావడంతో ఈ సినిమాకు రెస్పాన్స్ తక్కువగా ఉంది. ప్రస్తుతం ఉన్న కలెక్షన్స్ ట్రెండ్ చూస్తుంటే ఈ సినిమా బ్రేక్ ఈవెన్ మార్క్ చేరుకోవడం కష్టమేనని ట్రేడ్ విశ్లేషకులు అంటున్నారు.  ఈ వీకెండ్ లోపు బ్రేక్ ఈవెన్ మార్క్ చేరలేకపోతే ఛాన్స్ మిస్ అయినట్టే. ఎందుకటే ఒక్కసారి 'సైరా' రిలీజ్ అయితే అందరి దృష్టి దానిపైనే ఉంటుంది. వరుణ్ సినిమాను పట్టించుకునేవారు దాదాపుగా ఉండరు.

ఈమధ్య ఓవర్ సీస్ లో చాలా సినిమాలు నష్టాల బాట పడుతున్నాయి. స్టార్ హీరోల సినిమాల నుండి మీడియం రేంజ్ హీరోల సినిమాల వరకూ అందరికీ అదే ఇబ్బంది ఎదురవుతోంది. మరి ఈ సినిమా ఆ లిస్టులో చేరుతుందా.. లేక బ్రేక్ ఈవెన్ టచ్ చేస్తుందా అనేది సెకండ్ వీకెండ్ పూర్తయ్యేసరికి క్లారిటీ వస్తుంది.

    
    
    

Tags:    

Similar News