గాలి గారి టాలీవుడ్ చెల్లింపులు 6 కోట్లు

Update: 2016-11-27 08:12 GMT
తమన్నాకు రూ.80 లక్షలు.. రకుల్ ప్రీత్ కు రూ.20 లక్షలు అంటూ.. గాలి వారి పెళ్లిలో చేసిన సందడికి రకరకాల ఫిగర్లు బయటికి వచ్చాయి. మొత్తంగా మన సెలబ్రెటీలకు ఎంత ఇచ్చారన్న క్లారిటీ లేదు. ఇప్పుడు ఆ లెక్కలు అధికారికంగా బయటికి వస్తున్నాయి. మొన్నటి ఆదాయపు పన్ను శాఖ అధికారుల రైడింగ్ సందర్భంగా తన కూతురి పెళ్లి వేడుకలో సందడి చేసిన టాలీవుడ్ సెలబ్రెటీలందరికీ కలిపి ఏకంగా రూ.6 కోట్లు కోట్లు సమర్పించుకున్నట్లు వెల్లడైంది. ఇందుకు సంబంధించిన ఆధారాలన్నింటినీ అధికారులు స్వాధీనం చేసుకున్నారు.

గాలి గారు ఇచ్చారు.. మనం పుచ్చుకున్నాం.. ఇక అంతా గప్ చుప్ అనుకున్న టాలీవుడ్ సెలబ్రెటీలకు ఇప్పుడిక గుండెల్లో రైళ్లు పరుగెత్తడం ఖాయం. పుచ్చుకున్న మొత్తానికి లెక్కలు చూపించాలి. పన్ను కట్టాలి. అసలింతకీ గాలి ఇచ్చింది ఏ డబ్బో తెలియాలి. ఏ రకంగా ఇచ్చాడో కూడా చెప్పాలి. అది బ్లాక్ మనీ అయితే లెక్క వేరుగా ఉంటుంది. ఆల్రెడీ రకుల్ ప్రీత్ సింగ్ కు ఆదాయపు పన్ను శాఖ నుంచి నోటీసులు అందినట్లు వార్తలు వచ్చాయి. కాస్త ముందో వెనుకో మిగతా వాళ్లకు కూడా నోటీసులు రావడం ఖాయం. అక్కడా ఇక్కడా లెక్కలు మ్యాచ్ కాకుండా ఇబ్బందులు తప్పవు. తమన్నా.. రకుల్ ప్రీత్.. కేథరిన్ థ్రెసా.. శాన్వి.. సాయికుమార్ లాంటి తారలు గాలి పెళ్లి వేడుకలో అతిథుల్ని ఎంటర్టైన్ చేసినట్లు తెలుస్తోంది. జబర్దస్త్ కమెడియన్లు కూడా అక్కడ పెర్ఫామ్ చేసి భారీగానే డబ్బు పుచ్చుకున్నట్లు సమాచారం.

Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/
Tags:    

Similar News