వైఎస్ ఆర్ కాంగ్రెస్ పార్టీ అంటే ఒంటికాలిపై లేచే టీడీపీ సీనియర్ నేత - ఎమ్మెల్సీ గాలి ముద్దుకృష్ణమనాయుడు మరోమారు జగన్ జాతకం చదివారు. ఆపరేషన్ ఆకర్ష్ ఆలోచనతో వైసీపీని చీల్చడాన్ని జీర్ణించుకోలేని జగన్ సేవ్ డెమోక్రసీ పిలుపు ఇచ్చిన సంగతి తెలిసిందే. దీనిపై స్పందించిన గాలి ముద్దుకృష్ణమనాయుడు హైదరాబాద్ లో మీడియాతో మాట్లాడుతూ జగన్ తీరుపై ఫైర్ అయ్యారు.
వైసీపీ అధినేత జగన్ సేవ్ డెమోక్రసీ అనడం విడ్డూరంగా ఉందని ఎద్దేవా చేశారు. రాజ్‌భవన్ దగ్గర ప్రభుత్వాన్ని కూల్చుతానన్నది జగన్ కాదా అని ప్రశ్నించారు. వైఎస్ రాజశేఖర్ రెడ్డి సీఎంగా ఉన్న సమయంలో టీఆర్ ఎస్ ను చీల్చలేదా అని గాలి ముద్దుకృష్ణమ నిలదీశారు. అప్పుడు సేవ్ డెమోక్రసీ గుర్తు లేదా అని జగన్‌ను ప్రశ్నించారు.ఎమ్మెల్యేలు అభివృద్ధి కోణంలోనే టీడీపీలో చేరుతున్నారని చెప్పిన ముద్దుకృష్ణమ తమపై విమర్శలు చేయడాని కంటే ముందు అసలెందుకు ఇలా జరుగుతుందో, తన వ్యక్తిత్వంలో ఉన్న లోపాలేంటో సమీక్షించుకోవాలని జగన్ కు హితవు పలికారు.