రామ్ చరణ్ ఆర్ సి 9 టైటిల్ బ్రూస్లీగా ఫిక్స్ చేశారు. ది ఫైటర్ అనేది ట్యాగ్ లైన్. టైటిల్ ఎంత పవర్ ఫుల్ గా ఉందో, ట్యాగ్ లైన్ లో అంతే పంచ్ కనిపిస్తోంది. ఈ చిత్రంలో చరణ్ బాడీ డబుల్ ఆర్టిస్టు(ఫైటర్)గా నటిస్తున్నాడు. శ్రీనువైట్ల తన శైలిని మార్చి ఈసారి కాస్త కొత్తగానే ఎటెంప్ట్ చేస్తున్నాడని చెబుతున్నారు. ఈ సినిమాలో చరణ్ క్యారెక్టర్ లో గ్యాంగ్ లీడర్ షేడ్స్ కనిపిస్తాయనేది తాజా అప్ డేట్.
ఈ సినిమాకి రచయితగా పనిచేస్తున్న గోపిమోహన్ ఈ టాప్ సీక్రెట్ ని రివీల్ చేశారు. 'బ్రూస్లీ - ది ఫైటర్' పూర్తి ఫ్యామిలీ ఎంటర్ టైనర్. యాక్షన్, లవ్, వినోదం జోడించి తెరకెక్కిస్తున్నారు. చరణ్ క్యారెక్టర్ లో మెగాస్టార్ చిరంజీవి నటించిన గ్యాంగ్ లీడర్ షేడ్స్ కనిపిస్తాయి. రషెస్ చూశాను. ఆడియెన్ ఈ చిత్రానికి కనెక్టవుతారు... అని చెప్పాడు. మెగాస్టార్ కెరీర్ లో గ్యాంగ్‌లీడర్ ఓ కీలకమలుపు. చిరులోని కొత్త కోణాన్ని ఆవిష్కరించిన చిత్రమిది. కాని అక్కడే అసలు సీన్ ఉంది.
ఈ సినిమాతో చరణ్ పోలిక బావుంది కానీ, ఆ సినిమాకి కుదిరినట్టు మ్యూజిక్, స్టోరీ, క్యారెక్టరైజేషన్ ప్రతిదీ సరిగ్గా సెట్ అవ్వాలి. లేదంటే ఆడియెన్ ముందే గ్యాంగ్ లీడర్ ని తలుచుకుంటూ ముందస్తు అంచనాతో థియేటర్లకు వస్తారు. ఏమాత్రం నిరాశపరిచినా అంతే సంగతులు. కాబట్టి శ్రీనువైట్ల చరణ్ ని ఆ రేంజులో చూపిస్తాడనే అనుకుందాం. చరణ్ బాడీ లాంగ్వేజ్ లో చిరులోని టింజు కనిపిస్తుంది కాబట్టి హీరోయిజానికేం ఢోఖా లేదు. జస్ట్ వెయిట్ అండ్ సీ.