మెగాస్టార్‌ తల్లిగా బిబి గంగవ్వ?

Update: 2021-10-04 13:30 GMT
మెగాస్టార్‌ చిరంజీవి సినిమాలో చిన్న పాత్ర అయినా ఎంతో ప్రాముఖ్యత కలిగి ఉంటుంది. చిరు మూవీలో చిన్న పాత్ర చేసేందుకు పెద్ద స్టార్స్‌ ను లేడా ట్యాలెంటెడ్‌ స్టార్స్ ను తీసుకుంటారు. కాని చిరంజీవి గాడ్ ఫాదర్ లో ఒక పాత్రకు గాను విలేజ్ బ్యాక్‌ గ్రౌండ్ ఉన్న నటనలో ఏమాత్రం శిక్షన పొందని గంగవ్వను ఎంపిక చేయడం జరిగిందట. అది కూడా చిరంజీవి తల్లి పాత్రకు ఆమెను ఎంపిక చేశారనే వార్తలు వస్తున్నాయి. చిరంజీవి బిగ్ బాస్ సీజన్ 4 సమయంలో గంగవ్వతో మాట్లాడటం జరిగింది. ఆ సమయంలోనే గంగవ్వపై ప్రశంసల వర్షం కురిపించారు. మళ్లీ ఇప్పుడు తల్లి పాత్రకు గాను ఆమెను స్వయంగా చిరంజీవి రిఫర్ చేశారనే వార్తలు వస్తున్నాయి. చిరంజీవికి తల్లి పాత్ర అంటే మామూలు విషయం కాదు.

గంగవ్వ మై విలేజ్ షో అనే యూట్యూబ్‌ ఛానెల్ ద్వారా మంచి గుర్తింపు దక్కించుకుంది. గ్రామంలో యువకులు చిన్న చిన్న వీడియోలు తీస్తున్న సమయంలో ఆ వీడియోల్లో కనిపించడం మొదలు పెట్టింది. ఆ వీడియోలతో మంచి పాపులారిటీని దక్కించుకుంది. యూట్యూబ్‌ నుండి సినిమాల్లో ఎంట్రీ ఇచ్చింది. చిన్న చిన్న పాత్రలు సినిమాల్లో చాలానే చేసింది. ఇటీవల లవ్‌ స్టోరీ సినిమాలో చైతన్య కు బామ్మగా కనిపించింది.. రాజ రాజ చోర సినిమాలో కూడా గంగవ్వ కీలక పాత్రలో కనిపించింది. ఇంకా పలు సినిమాల్లో కూడా ఈమె నటిస్తున్నట్లుగా వార్తలు వస్తున్నాయి. ఇబ్బడి ముబ్బడిగా ఆఫర్లు వస్తున్నా కూడా గంగవ్వ మాత్రం అన్నింటికి ఓకే చెప్పకుండా మెల్ల మెల్లగా సినిమాలు చేస్తున్నట్లుగా తెలుస్తోంది.

గంగవ్వకు ఇప్పుడు మెగాస్టార్ చిరంజీవి సినిమాలో ఆఫర్‌ వచ్చింది అంటే ఇక ఆమె వెను దిరిగి చూసుకోవాల్సిన అవసరం లేదు. బిగ్ బాస్ లో ఉన్న సమయంలో ఆమె తనకు సొంత ఇల్లు నిర్మించుకోవాలనే కల ఉంది. ఆ కలను నెరవేర్చుకునేందుకు ఎంత కష్టం అయినా పడి ఉంటాను అంది. గంగవ్వ బిగ్‌ బాస్ లో ఉన్న మొదటి రెండు మూడు వారాలు మంచి ఎంటర్ టైన్ చేసింది. ఆ తర్వాత హోమ్‌ సిక్ అవ్వడం వల్ల ఆమె మెల్లగా బయటకు వచ్చేసింది. బిగ్‌ బాస్ హౌస్‌ ద్వారా అలా బయటకు రావడం చాలా అరుదుగా జరుగుతుంది గంగవ్వకు ప్రత్యేక అనుమతులు దక్కి బయటకు వచ్చేసింది.

మెగాస్టార్‌ చిరంజీవి తల్లి పాత్రలో గంగవ్వ కనిపించేది కొద్ది సమయం అయినా కూడా చాలా బలమైన పాత్రగా చెబుతున్నారు. లూసీఫర్ కు రీమేక్ గా రూపొందుతున్న గాడ్ ఫాదర్ లో గంగవ్వ నటిస్తుంది అనే విషయాన్ని అతి త్వరలో అధికారికంగా మేకర్స్‌ ప్రకటించే అవకాశాలు ఉన్నాయని అంటున్నారు. ఒక వేళ సినిమా విడుదల అయ్యే వరకు కూడా సస్పెన్స్ ను మెయింటెన్‌ చేయవచ్చు. మొత్తానికి గంగవ్వ చిరంజీవి సినిమాలో కనిపించబోతుంది అనేది బలంగా వినిపిస్తున్న వార్త.
Tags:    

Similar News