ఇప్పటివరకు భారీ చేజులున్న యాక్షన్ సినిమాలంటే మనం ఎక్కువగా హాలీవుడ్ లో చూస్తుంటాం. అయితే ఈ మధ్యన బడ్జెట్లు పెంచేసి హిందీ సినిమాల్లో కూడా కొన్నింటిలో అలాంటి మ్యాజిక్ చేసేస్తున్నారు. కాని తెలుగులో మాత్రం ఆ స్థాయిని అందుకోవాలంటే పెద్ద స్టార్లు ఉండాల్సిందే. కాని దర్శకుడు ప్రవీణ్ సత్తారు మాత్రం సీనియర్ హీరో రాజశేఖర్ ను మెయిన్ లీడ్లో పెట్టేసి ''గరుడ వేగ'' అంటూ ఇప్పుడు సినిమా తీసేశాడు.
ఇంతకీ సినిమా టైటిల్ కూ సినిమాకు ఉన్న లింకేంటో ట్రైలర్లో అర్దంకాలేదు కాని.. ఈ ట్రైలర్ మాత్రం క్వాలిటీ పరంగా అదిరిపోయింది. ది బార్న్ ఐడెంటిటీ సినిమాల తరహాలో చేజ్ సీన్లు బాగున్నాయి. ఇక రాజశేఖర్ కోసం మరోసారి సాయికుమార్ వాయిస్ అందించేశాడు కాబట్టి.. అది కూడా బాగానే ఉంది. అసలు హైదరాబాదులో ఏదో జరగబోతోంది.. తీవ్రవాదులు ఏదో చెయ్యబోతున్నారు.. దానిని ఈ ఏజెంట్ శేఖర్ ఎలా కనిపెడతాడు.. ఏం చేస్తాడు అనేదే కథ. అయితే దానికి తగినంత ఉత్కంఠ ట్రైలర్లో కనిపించకపోయినా కూడా.. గ్రాఫిక్స్ వాడుకుని సినిమాను బాగానే తీశాడని అనుకోవచ్చు. గరుడ వేగ క్వాలిటీ పరంగా అదిరింది. మరి కంటెంట్ ఎలా ఉంటుందో మాత్రం అప్పుడే చెప్పలేం.
టీజర్ మొత్తంలో మాస్ మెచ్చే అంశం ఏంటంటే.. ఆఖరిలో అలా సన్నీ లియోన్ చిరునవ్వులు చిందించిన క్లోజప్ ఉంది చూశారూ.. అబ్బో అదిరింది. మొత్తంగా ప్రవీణ్ సత్తారు కాస్త బడ్జెట్ ఎక్కువ పెట్టినా కూడా క్వాలిటీ ఉన్న సినిమానే తీశాడు. లెటజ్ సీ ధియేటర్లో నవంబర్ 3న ప్రేక్షకులు ఏం తీర్పు ఇస్తారో!!
Full View