లైగర్ పాపకు.. గౌరీ ఖాన్ డేటింగ్ కౌంటర్

Update: 2022-09-19 11:34 GMT
కాఫీ విత్ కరణ్ షోలో ఎప్పుడూ కూడా డబుల్ మీనింగ్ డైలాగ్స్ తో పాటు సెక్స్ కు సంబంధించిన అంశాలు ఎక్కువగా చర్చల్లోకి వస్తూ ఉంటాయి అని అందరికీ తెలిసిన విషయమే. ఆ షోలోకి గెస్ట్ లుగా ఎవరూ వచ్చినా సరే ముందుగా కరణ్ జోహార్ శృంగారానికి సంబంధించిన ప్రశ్నలు డైరెక్ట్ గా అడుగుతూ ఉంటారు. ఇక వచ్చిన సెలబ్రిటీలు కూడా ఏమాత్రం సందేహించకుండా ఆ ప్రశ్నలకు మరింత బోల్డుగా సమాధానం చెబుతూ మరింత ఆశ్చర్యానికి గురి చేస్తూ ఉంటారు.

ఇక లేటెస్ట్ గా మరో ముగ్గురు ప్రముఖ సెలబ్రిటీలను తన షోలోకి తీసుకువచ్చిన కరణ్ జోహార్ ఈసారి డోస్ తగ్గించాడు కాస్త తక్కువ స్థాయిలో ఉండే బోల్డ్ ప్రశ్నలు సమాధానం చెప్పాలని అడిగాడు. కాఫీ విత్ కరణ్ సీజన్ 7, 12వ ఎపిసోడ్‌లో, షారుక్ ఖాన్ భార్య గౌరీ ఖాన్, మహీప్ కపూర్ (సంజయ్ కపూర్ భార్య) అలాగే భావా పాండే (చంకీ పాండే భార్య, అనన్య పాండే తల్లి) అతిథులుగా వస్తున్నారు.  

యంగ్ హీరోయిన్ అనన్య పాండేకి గౌరీ ఖాన్ ఇచ్చే సలహా గురించి కరణ్ జోహార్ అడిగాడు.  ఆమె వెంటనే, "ఇద్దరు అబ్బాయిలతో ఒకే సమయంలో డేటింగ్ చేయవద్దు" అని చెప్పి షాక్ ఇచ్చింది.

ఇటీవల కాలంలో కొంతమంది  బాలీవుడ్ హీరోయిన్స్ ఒకరితో ప్రేమలో ఉంటూనే మరొకరితో డేటింగ్ కూడా చేస్తున్నట్లు అనేక రకాల వార్తలు వస్తున్నాయి.

ఇక అదే విషయంపై గౌరిఖాన్ ఓపెన్ గానే స్పందించడం విశేషం. అంతేకాకుండా అనన్య పాండే గురించి ఆమె ఈ విధంగా వివరణ ఇవ్వడం హాట్ టాపిక్ గా మారింది. ఆ షోలో చాలా సాధారణంగా చెప్పినప్పటికీ కూడా ఒక విధంగా గౌరీ కౌంటర్ వేసినట్లుగా నెటిజన్లు స్పందిస్తున్నారు.

ఆ మధ్యకాలంలో నిజంగానే అనన్య ఇద్దరితో ఒకేసారి డేటింగ్ చేసినట్లు అనేకరకాల వార్తలొచ్చాయి. అనన్య షాహిద్ కపూర్ సోదరుడు ఇషాన్ ఖట్టర్‌తో అలాగే మరో యువ హీరోతో ఒకేసారి డేటింగ్ చేస్తున్నట్లు వార్తలు వచ్చాయి. ఇక రీసెంట్ గా ఈ బ్యూటీ లైగర్ సినిమాలో నటించిన విషయం తెలిసిందే. ఆ సినిమా బాక్సాఫీస్ వద్ద డిజాస్టర్ గా నిలిచింది.



నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.
Tags:    

Similar News