ప్రస్తుతం తమిళనాడులో హాట్ టాపిక్.. ఆర్కే నగర్ ఉప ఎన్నిక. తమిళనాడు మాజీ ముఖ్యమంత్రి జయలలిత మరణంతో ఖాళీ అయిన ఈ నియోజకవర్గానికి.. ఏప్రిల్ లో ఎన్నికలు జరగనున్నాయి. అమ్మ ఖాళీ చేసి వెళ్లిపోయిన స్థానం కావడంతో.. ఈ ఎన్నిక అందరినీ ఆకట్టుకుంటోంది.
ఆర్కే నగర్ నియోజకవర్గంలో జరగనున్న ఉప ఎన్నికలో తమ అభ్యర్ధిగా.. సినీ నటి గౌతమి ని నిలబెట్టాలని బీజేపీ ప్రయత్నిస్తున్నట్లు తెలుస్తోంది. గౌతమి పోటీలో నిలవడం ఖాయమనే న్యూస్ కూడా ఎక్కువగానే చక్కర్లు కొడుతోంది. జయలలిత మరణం తర్వాత.. ఆ మరణంపై విచారణ జరిపించాలని.. మొట్టమొదట ధైర్యంగా డిమాండ్ చేసిన వ్యక్తి గౌతమి. అందుకే ఈమెనే తగిన కేండిడేట్ గా భావించిందట బీజేపీ. అయితే.. ఇందులో వాస్తవం లేదని.. గౌతమి ఎన్నికల్లో పోటీ చేయడం లేదనే విషయం తేలిపోయింది.
గత కొన్ని రోజుల్లో ఇలాంటి ఎంక్వైరీలు చాలా వస్తున్నాయని అంటన్న ఆమె.. సామాజిక సేవ చేసేందుకు ప్రత్యక్ష రాజకీయాల్లో ఉండాల్సిన అవసరం లేదని తేల్చేసింది. తాను ఇప్పుడే కాదు.. ఎప్పటికీ పాలిటిక్స్ లోకి రానని.. ఎన్నికల్లో పోటీ చేయనని తేల్చి చెప్పేసిందట గౌతమి.
Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/