గౌతమి టాలీవుడ్లో కనిపించి చాలా రోజులైంది. ఇటీవల తమిళంలో తన భర్త కమల్ హాసన్ తో కలిసి పాపనాశనం(దృశ్యం రీమేక్) చిత్రంతో రీ ఎంట్రీ ఇచ్చింది. నదియ - సుకన్య లాంటి వాళ్లు వెండితెరపై రాణిస్తున్నప్పుడు తాను మాత్రం ఎందుకు రాణించకూడదూ అనుకుందో ఏమో... తెలుగులో కూడా ఓ సినిమా చేయడానికి రెడీ అయిపోయి... అందులోనూ మోహన్ లాల్ లాంటి సూపర్ స్టార్ సరసన నటించడానికి ఒప్పేసుకుంది. వైవిధ్యభరిత చిత్రాలను తెరకెక్కించే చంద్రశేఖర్ యేలేటి దర్శకత్వంలో వీళ్లిద్దరూ కలిసి నటిస్తున్న విషయం తెలిసిందే. సాయి కొర్రపాటి నిర్మిస్తున్న ఈ చిత్రం టీజర్ ఇటీవలే రిలీజ్ అయింది. దానికి అనూహ్య స్పందన వస్తోంది.
ఓ మధ్య తరగతి కుటుంబాన్ని లీడ్ చేసే గృహిణిగా గౌతమి నటిస్తోంది. ఇందులో ఆమె పాత్రపేరు గాయత్రి అని తెలుస్తోంది. తన సొంత పేరుకు దగ్గరగా వుండేటట్టుగా.. క్యారెక్టర్ పేరును గాయత్రిగా నిర్ణయించారని సమాచారం. ఇందులో విశ్వంత్ - రైనారావ్ లిద్దరూ వారి సంతానంగా నటిస్తున్నారు. ఈ నలుగురు నాలుగు సమస్యల్లో పీకల్లోతు దాకా కూరుకుపోయి... వాటిని ఎలా అధిగమించారనే కథాంశంతో ఈ చిత్రం తెరకెక్కింది. మరి ఇందులో గాయత్రిగా నటించిన గౌతమి ఎలాంటి సమస్యను ఎదుర్కొంది.. దాన్ని ఎలా అధిగమించిందో తెలియాలంటే.. కొద్దికాలం ఆగాల్సిందే. ఈనెలలోనే ఈ చిత్రం ప్రేక్షకుల ముందుకు రాబోతోందట. జస్ట్ వెయిట్ అండ్ సీ ఫర్ గౌతమి యాక్టింగ్.