తెలుగులో మాంచి మాస్ ఫాలోయింగ్ ఉన్న హీరోల్లో నందమూరి బాలకృష్ణ ఒకడు. ఆయన సినిమాలకు మాస్ ఏరియాల్లో మాంచి వసూళ్లు వస్తుంటాయి. ఐతే బాలయ్య తన వందో సినిమాగా చారిత్రక నేపథ్యం ఉన్న ‘గౌతమీపుత్ర శాతకర్ణి’ చేశాడు. ఈ సినిమా మాస్ ప్రేక్షకుల్ని ఏ మేరకు మెప్పిస్తుందో అన్న సందేహాలున్నాయి. ఐతే ఇదే మాట దర్శకుడు క్రిష్ దగ్గర అంటే.. ‘గౌతమీపుత్ర శాతకర్ణి’ కంటే మాస్ సినిమా ఇంకేముంటుంది అని ప్రశ్నిస్తున్నాడు. ఈ సినిమా మాస్ ప్రేక్షకుల్ని ఉర్రూతలూగిస్తుందని అంటున్నాడు. సినిమాను కొన్ని పరిధుల మధ్య చూడటం మానుకోవాలని అతనంటున్నాడు.
‘‘శాతకర్ణి ఓ యుద్ధ పిపాసి. ఈ కథలో నాలుగు యుద్ధాలు చూపించాం. యుద్ధం కంటే మాస్ ఎలిమెంట్ ఎక్కడైనా ఉంటుందా? మానవీయ సంబంధాలు చూపించకపోతే నాకు సినిమా తీసినట్లు ఉండదు. ఇది ఓ యుద్ధ వీరుడి గాథే కాదు. ఓ గొప్ప తనయుడి కథ కూడా. అందుకే ఎమోషన్లు కూడా బాగా పండాయి. ఇది ఫలానా వర్గం వాళ్లను నచ్చే సినిమా కాదు. అందరూ కనెక్టయ్యే.. అందరికీ నచ్చే కథ’’ అని క్రిష్ స్పష్టం చేశాడు. ఈ సినిమాను 79 రోజుల్లోనే పూర్తి చేయడంపై క్రిష్ స్పందిస్తూ.. ‘‘జనాలకు 79 రోజులే కనిపిస్తున్నాయేమో. అంతకు ముందు నేనెంత ప్రసవ వేదన పడ్డానో నాకే తెలుసు. ఒక్కో పువ్వూ చేర్చి మాల కట్టినట్టు.. ఒక్కో సన్నివేశం చేరి సినిమా కథగా తయారవుతుంది. 'గౌతమిపుత్ర..' కూడా అలా మొదలైన కథే. ఈ సినిమా ఎప్పుడు మొదలెట్టాలి, ఎప్పుడు పూర్తి చేయాలి.. ఏ సన్నివేశంలో ఎవరుండాలి.. ఏ డైలాగ్ ఎలా చెప్పాలి.. అనే ప్రతి విషయంపై స్పష్టతో ఉన్నాం. పక్కా ప్రణాళికతో వ్యవహరించాం. కాబట్టే అంత వేగంగా సినిమా పూర్తయింది’’ అన్నాడు.
చిరంజీవి.. బాలయ్య అభిమానుల మధ్య పోటీ గురించి స్పందిస్తూ.. ‘‘చిరంజీవి.. బాలకృష్ణ ఇద్దరూ లెజెండ్స్. వాళ్లను మనం గౌరవించుకోవాలి. చిరంజీవి గారు మా సినిమా ప్రారంభోత్సవానికి విచ్చేశారు. తన స్నేహితుడి సినిమా బాగా ఆడాలని మనస్ఫూర్తిగా కోరుకొన్నారు. ఆయన మాట నిజమవ్వాలని చిరంజీవి అభిమానులంతా అనుకోవాలి. బాలయ్య సినిమా బాగుండాలని కోరుకొన్న చిరు సినిమా కూడా బాగా ఆడాలని బాలయ్య అభిమానులు కోరుకోవాలి’’ అని క్రిష్ చెప్పాడు.
Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/