శాతకర్ణి కోసం అంత ఖర్చు పెట్టారా?

Update: 2016-12-22 04:55 GMT
నందమూరి బాలకృష్ణ వందో చిత్రం గౌతమిపుత్ర శాతకర్ణి.. ట్రైలర్ తో టాలీవుడ్ ఆడియన్స్ ను విపరీతంగా ఆకట్టుకుంది. అప్పటివరకూ సినిమాపై ఉన్న అంచనాలను పదింతలు చేసేసింది. 17 శతాబ్దాల క్రితం నాటి కథను విజువలైజ్ చేయడంలో.. క్రిష్ ప్రతిభను అందరూ పొగుడుతున్నారు. శాతకర్ణిగా బాలయ్య నటనా కౌటిల్యానికి వందకు వంద మార్కులు పడుతున్నాయి. టాలీవుడ్ చరిత్రలో నిలిచిపోయే సినిమాగా భావిస్తున్న గౌతమిపుత్ర శాతకర్ణికి.. క్రిష్ ఎంత బడ్జెట్ పెట్టాడో తెలుసా?

శాతకర్ణిని పూర్తి చేసేందుకు నిర్మాణ సంస్థ ఫస్ట్ ఫ్రేమ్ ఎంటర్టెయిన్మెంట్స్ కు రూ. 55 కోట్లు ఖర్చయింది. ట్రైలర్ చూశాక ఇది చిన్న మొత్తమే అనిపించచ్చు కానీ.. ఇప్పటివరకూ బాలయ్య నటించిన సినిమాల్లో బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్.. 40 కోట్ల రూపాయల వసూళ్లను సాధించగలిగింది. అలాగే క్రిష్ తీసినిమాల్లో అత్యధికంగా వసూలైనది 30 కోట్లు మాత్రమే. అంటే.. హీరో- డైరెక్టర్ ఎవరికీ 55 కోట్ల మార్క్ ను అందుకున్న హిస్టరీ లేదు.

అయినా సరే.. గౌతమిపుత్ర శాతకర్ణికి అద్భుతంగా బిజినెస్ జరిగింది. తమ పెట్టుబడికి మించి ప్రీ రిలీజ్ బిజినెస్ జరగడం నిర్మాతలను ఆనందంలో ముంచెత్తింది. రిలీజ్ కి ముందే నిర్మాతలు లాభాల్లోకి ఎంటర్ అయిపోగా.. సంక్రాంతికి రానున్న ఈ మూవీ డిస్ట్రిబ్యూటర్లకు  కూడా లాభాల పంట పండించడం ఖాయం అనే అంచనాలు ఉన్నాయి. ట్రైలర్ చూశాక అది ఖాయమే అనిపిస్తోందిలే.

Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/
Tags:    

Similar News