నాగచైతన్య.. సమంత జంటగా నటించిన మొదటి చిత్రం ఏమాయ చేశావే. ఇది తమిళ హిట్ మూవీ ‘విన్నైతండి వరువాయ’ కు రీమేక్ అనే విషయం తెల్సిందే. తమిళం మరియు తెలుగులో గౌతమ్ మీనన్ దర్శకత్వం వహించిన విషయం తెల్సిందే. రెండు వర్షన్ ల క్లైమాక్స్ లు విభిన్నంగా ఉంటాయి. తమిళ వర్షన్ లో హీరో శింబు.. హీరోయిన్ త్రిషల వివాహం జరుగదు. హీరోయిన్ మరో వ్యక్తిని పెళ్లి చేసుకుని వెళ్లి పోతుంది. ఆ సినిమాలో దర్శకుడు యాంటీ క్లైమాక్స్ పెట్టాడు. దానికి కొనసాగింపుగా తాజాగా ఒక షార్ట్ ఫిల్మ్ ను దర్శకుడు గౌతమ్ మీనన్ రూపొందించాడు.
ఈ షార్ట్ ఫిల్మ్ లో శింబు ఇంకా త్రిషలు కనిపించారు. ఎవరి ఇంట్లో వారు ఉండి ఈ షార్ట్ ఫిల్మ్ లో నటించారు. దర్శకుడిగా మారిన కార్తిక్ పెళ్లి చేసుకోకుండా అలాగే ఉండి పోతాడు. ఈ విపత్తు సమయంలో షూటింగ్స్ క్యాన్సల్ అయ్యి ఒక చోట ఒంటరిగా చిక్కుకు పోయిన కార్తిక్ స్క్రిప్ట్ రాసేందుకు ప్రయత్నిస్తూ ఏం రాయలో తెలియక చిరాకు పడుతూ ఉంటాడు. ఇలాంటి సమయంలో జెస్సీ గుర్తుకు వచ్చి ఆమెకు కాల్ చేస్తాడు.
షార్ట్ ఫిల్మ్ 12 నిమిషాలు సాగగా అందులో ఎక్కువ సమయం ఇద్దరు ఫోన్ లో మాట్లాడుకున్నదే చూపించాడు. సింగిల్ గానే కార్తిక్ ఉన్నాడనే విషయం తెలిసి జెస్సీ బాధపడుతుంది. ఇద్దరు ఏం మాట్లాడుకుంటారు అనే ఆసక్తి కలిగించేలా దర్శకుడు గౌతమ్ మీనన్ కథను నడిపించాడు.
సూపర్ హిట్ ఫిల్మ్ కు కొనసాగింపుగా వెబ్ సిరీస్ రావడం కాస్త ఆశ్చర్యంగా విభిన్నంగా ఉందంటూ నెటిజన్స్ కామెంట్స్ చేస్తున్నారు. ఈ షార్ట్ ఫిల్మ్ ను కార్తిక్ డయల్ సేతాయెన్ అనే టైటిల్ తో విడుదల చేశారు.