‘చెలి’ సినిమాతో హీరోగా పరిచయమయ్యాడు గౌతమ్ మీనన్. ఆ సినిమా మామూలుగానే ఉంటుంది కానీ.. ఆ తర్వాత ‘కాక్క కాక్క’తో అతడేంటో జనాలకు తెలిసింది. ఆ సినిమాతో ఓవర్ నైట్ స్టార్ డైరెక్టర్ అయిపోయాడు గౌతమ్. తన తొలి సినిమా స్క్రిప్టు విషయంలో మాత్రం తాను అంత కాన్ఫిడెంట్ గా లేనని చెబుతున్నాడు గౌతమ్. అలాంటి స్క్రిప్టు తీసుకుని మణిరత్నం లాంటి దిగ్గజ దర్శకుడికి నరేషన్ ఇవ్వాల్సిన ఇబ్బందికర పరిస్థితిని తాను ఎదుర్కొన్నట్లు వెల్లడించాడు గౌతమ్. ఇందుకు కారణం మాధవనే అని.. ఈ విషయంలో అతణ్ని తాను ఎప్పటికీ క్షమించలేనని తాజాగా ఒక ఇంటర్వ్యూలో వ్యాఖ్యానించాడు గౌతమ్ మీనన్.
‘‘మిన్నలే (చెలి) కథను ముందు మాధవన్ కు చెప్పాను. అప్పటికి అతను మణిరత్నం సార్ ను గాడ్ ఫాదర్ లాగా భావించేవాడు. ఆయనే అతణ్ని హీరోగా పరిచయం చేశాడు. ఐతే నాకు చాలా ఇబ్బందిగా అనిపించింది. మణిరత్నం లాంటి లెజెండ్ ముందుకెళ్లి నా సాదాసీదా స్క్రిప్టును వినిపించడానికి చాలా ఇబ్బంది అయింది. ఆ పరిస్థితిని అవాయిడ్ చేద్దామన్నా కుదర్లేదు. మణి సార్ టైం ఎంత విలువైందో నాకు తెలుసు. అలాంటి వ్యక్తి దగ్గరికి వెళ్లి నా స్క్రిప్టు నరేషన్ కోసం గంట సమయాన్ని వృథా చేయడానికి చాలా ఇబ్బంది పడిపోయాను. ఐతే ఎలాగోలా నరేషన్ పూర్తి చేశాను. ఆయన ఓకే చెప్పారు. ఐతే నన్ను ఎంతగానో ఇన్ స్పైర్ చేసిన లెజెండరీ డైరెక్టర్ దగ్గర నాకు ఇలాంటి ఇబ్బందికర పరిస్థితి కల్పించినందుకు మాత్రం మ్యాడీని ఎప్పటికీ క్షమించను’’ అని గౌతమ్ తెలిపాడు.
Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/