వారం తరువాత ఇప్పుడు భజనేంటో!!

Update: 2017-08-03 16:01 GMT
అసలు ఒక సినిమాను ఎప్పుడు ప్రమోట్ చేయాలి? రిలీజ్ కు ముందు బీభత్సంగా ప్రమోట్ చేసి.. రిలీజైన 2వ రోజు నుండి ఇంకా బీభత్సంగా ప్రమోట్ చేయాలి. అప్పుడే ఏ సినిమాకైనా కూడా మాంచి బజ్ వస్తుంది. రిలీజయ్యాక ఎంతటి నెగెటివ్ టాక్ వచ్చినా కూడా.. ప్రమోషన్ బాగా చేస్తే సినిమా నిలబడే ఛాన్సుంది. ఈ మధ్యన చాలా సినిమాలకు యావరేజ్ టాక్ వచ్చినా కూడా.. రిలీజైన తదుపరి రోజు నుండే బ్లాక్ బస్టర్ బ్లాక్ బస్టర్ అంటూ భజన చేయడం కారణంగా అవి నిజంగానే హిట్టయిపోతున్నాయి.

అసలు టాపిక్ ఏంటంటే.. గోపిచంద్ హీరోగా సంపత్ నంది డైరక్షన్లో వచ్చిన సినిమా ''గౌతమ్ నంద''. సినిమాలో కొన్ని ఎలిమెంట్స్ ఎంత కొత్తగా ఉన్నా కూడా.. ఎందుకో అంతా కూడా ఎక్కడో చూసిన రొటీన్ మాస్ సినిమాలా అనిపించేసింది. అందుకే సినిమా అందరికీ పెద్దగా ఎక్కలేదు. దానికితోడు మన దర్శకుడు కామెడి ట్రాక్ ను పెద్దగా ఇంప్రువైజ్ చేయలేదు. అందుకే బి-సి సెంటర్లలో సినిమా కాస్త స్లో అయ్యింది. అయితే మొన్న శుక్రవారం సినిమా వచ్చింది కాబట్టి.. చక్కగా సోమవారం నాడు సక్సెస్ మీట్ పెట్టుంటే బాగుండేది. కాని ఈ శుక్రవారం మరో రెండు సినిమాలు రిలీజ్ కోసం నానా హంగామా చేస్తున్న వేళ సినిమాను సక్సెస్ అంటూ పెద్ద భజన ప్రోగ్రామ్ పెట్టారు. ఎలా వర్కవుట్ అవుతుంది బాసూ?

పాపం గోపిచంద్ మాత్రం.. తన సినిమా కొన్న వారందరికీ మరింత డబ్బులు రావాలంటూ జెన్యూన్ గా కోరుకుంటున్నాడు. ఇక దర్శకుడు సంపత్ నంది అయితే.. ఆయన తీసిన తండ్రి సెంటిమెంట్ సీన్లకు ఫోన్ల మీద ఫోన్లు వచ్చేస్తున్నాయి అంటున్నాడు. ఫైనల్ గా సినిమా హిట్టే అనమంటారా ఏంటి కొంపతీసి!!
Tags:    

Similar News