అర్జున్ రెడ్డిని దాటడం ఖాయమే

Update: 2018-08-19 13:59 GMT
ఒక సినిమా సక్సెస్ ని ఊహించడం అందరూ చేసేదే కానీ అది అంచనాలను మించి పోవడం అనేది మాత్రం చాలా అరుదుగా జరుగుతుంది. ఈ ఏడాది రంగస్థలం-మహానటి అలాంటి విజయాలనే సొంతం చేసుకోగా భరత్ అనే నేను తన మీద హైప్ కు తగ్గ సక్సెస్ ని సొంతం చేసుకుంది. ఇప్పుడు ఈ క్యూలో గీత గోవిందం వచ్చి చేరింది. కాకపోతే వాటికి దీనికి ఒక్క విషయంలో చాలా వ్యత్యాసం ఉంది. అవన్నీ భారీ బడ్జెట్ తో స్టార్ పవర్ ని నమ్ముకుని తీసిన సినిమాలు. కానీ గీత గోవిందం ఇప్పుడిప్పుడే కుదురుకుంటున్న విజయ్ దేవరకొండ హీరోగా ఒక్క సినిమా అనుభవం మాత్రమే ఉన్న రష్మిక మందన్న హీరోయిన్ గా రూపొందిన మూవీ. స్టార్ హీరోల సినిమాలకు ఏ మాత్రం తీసిపోని రీతిలో సంచలనం రేపుతోంది. కర్నూల్ లాంటి మధ్యతరహా నగరంలో ఈ ఆదివారం అంటే ఐదవ రోజు సాయంత్రం ఏకంగా 7 స్క్రీన్లలో గీత గోవిందం షోలు వేస్తే అన్ని హౌస్ ఫుల్ కావడం దీనికి నిదర్శనంగా చెప్పొచ్చు. అక్కడ మొత్తం ఉన్నవే 15 స్క్రీన్లు. చాలా చోట్ల ఇంచుమించు ఇదే పరిస్థితి ఉంది.

ఇక ఓవర్సీస్ లో పరిస్థితి దీనికి భిన్నంగా ఏమి లేదు. ఇవాళ్టితో 1.5 మిలియన్ మార్క్ చేరుకున్న గీత గోవిందం వచ్చే వీక్ ఎండ్ లోపు 2 మిలియన్ మార్క్ అందుకోవడం కష్టం కాదు. ఇప్పటి దాకా విజయ్ దేవరకొండ కెరీర్ లో బిగ్గెస్ట్ హిట్ గా నిలిచిన అర్జున్ రెడ్డి యుఎస్ లో తెచ్చిన వసూళ్లు 1.7 మిలియన్లు. గీత గోవిందం దాన్ని 6 లేదా 7వ రోజు అందుకుంటుంది కాబట్టి పెద్ద టార్గెట్ ని చేరుకోవడం సులభమే. పైగా తెలుగులో ఈ వారం కూడా చెప్పుకోదగ్గ పెద్ద విడుదలలు ఏమి లేవు. నీవెవరో-ఆటగాళ్లు-లక్ష్మి ఉన్నాయి కానీ టాక్ ని బట్టే వాటివైపు జనం చూసే పరిస్థితి. సో 30న @నర్తనశాల 31న శైలజారెడ్డి అల్లుడు వచ్చే వరకు గీత గోవిందంకు బ్రేకులు పడటం అసాధ్యం అనే చెప్పొచ్చు. ప్రీమియర్ల ద్వారానే యుఎస్ లో $400K రాబట్టిన గీతగోవిందం ఫైనల్ రన్ పూర్తయ్యే లోపు 2 మిలియన్ మార్క్ అందుకుంటే ఓవర్సీస్ లో విడుదలైన మూడో సినిమాకే ఈ ఘనత అందుకున్న హీరోగా విజయ్ దేవరకొండకు మరో రికార్డు తోడవుతుంది.
Tags:    

Similar News