గీతగోవిందం టాప్ 5 చేరుతుందా?

Update: 2018-09-16 07:30 GMT
ర్శకుడు పరశురామ్ దర్శకత్వ ప్రస్థానం గీత గోవిందం ముందు దాని తర్వాత అనేంతగా మారిపోయింది. చిన్న ట్విస్ట్ ఉన్న సింపుల్ లవ్ స్టోరీతో ప్రేక్షకులను మెప్పించిన తీరుకి 30 రోజులు దాటినా దాని తర్వాత చాలా సినిమాలే వచ్చినా ఇంకా వసూళ్లు వస్తూనే ఉన్నాయి. కొన్ని సెంటర్స్ లో వీక్ ఎండ్స్ హౌస్ ఫుల్స్ పడటాన్ని బట్టి పరిస్థితిని అర్థం చేసుకోవచ్చు. ఇక ఈ మేనియా ఇక్కడ మాత్రమే కాదు. ఓవర్సీస్ లో సైతం కొనసాగింది. ఇప్పటిదాకా టాప్ 10లో అడుగున ఉన్న గీత గోవిందం ఈపాటికే ఫిదా-ఖైదీ నెంబర్ 150లను దాటేసింది. తాజాగా త్రివిక్రమ్ శ్రీనివాస్ నవ్వుల బాణం అఆను క్రాస్ చేసి ఆరో స్థానం లాగేసుకుంది. నెక్స్ట్ టార్గెట్ ఆరో స్థానంలో ఉన్న మహానటి మీద పెట్టుకుంది. ఇప్పుడు లిస్ట్ లో ఉన్నవన్నీ ఫుల్ రన్ పూర్తి చేసుకున్నవి. గీత గోవిందం మరో పది రోజులు లేదా అర్ధ శతదినోత్సవం దాకా ఇలాగే కాంటిన్యూ కావడం దాదాపు ఖాయమే. ఇంకొంచెం కష్టపడితే శ్రీమంతుడిని కూడా నెట్టొచ్చు కానీ అదంతా ఈజీ కాదు. ఒకసారి టాప్ 10 యుఎస్ వసూళ్లను చూస్తే గీత గోవిందం పరిస్థితి ఏంటో అర్థమైపోతుంది

1. బాహుబలి 2 ది కంక్లూజన్ - $2,01,17,274

2. బాహుబలి బిగినింగ్ - $6,999,312

3. రంగస్థలం - $3,513,450

4. భరత్ అనే నేను - $3,416,451

5. శ్రీమంతుడు - $2,890,786

6. మహానటి - $2,543,515

7. గీత గోవిందం - $2,454,233 (స్టిల్ రన్నింగ్)

8. అఆ - $2,449,174

9. ఖైదీ నెంబర్ 150 - $2,447,043

10. ఫిదా - $2,066,937

దీని ప్రకారం చూస్తే మహానటిని క్రాస్ చేయటం ఈజీ కానీ శ్రీమంతుడిని దాటాలంటే మాత్రం చాలా కష్టపడాలి. అయినా విజయ్ దేవరకొండ మార్కెట్ కి రేంజ్ కి ఇదే పెద్ద అచీవ్మెంట్. అందులోనూ నెల రోజుల తర్వాత కూడా గీత గోవిందం ఇంకా ప్రభావం చూపిస్తోందంటే బ్లాక్ బస్టర్ అనే ట్యాగ్ కి న్యాయం చేకూర్చినట్టే. ప్రస్తుతానికి ఏడో స్థానంలో ఉన్న ఈ మూవీ టాప్ 5 చేరుకోవడం కష్టసాధ్యంగా కనిపిస్తోంది కానీ అసాధ్యం అని మాత్రం చెప్పలేం. మొత్తానికి యావరేజ్ హిట్స్ మాత్రమే ఉన్న పరశురామ్ ఇప్పుడు ఏకంగా దిగ్గజాల సినిమాల వసూళ్లనే దాటేసే రేంజ్ లో గీత గోవిందం తీయడంతో డిమాండ్ మామూలుగా లేదు.
Tags:    

Similar News