రెండు నెలల కిందట టాలీవుడ్లో సంచలనం రేపిన డ్రగ్స్ కేసులో గాయని గీతా మాధురి భర్త.. నటుడు నందు కూడా చిక్కుకున్న సంగతి తెలిసిందే. ఆ కేసుకు సంబంధించి పోలీసుల నోటీసులందుకున్న నందు.. విచారణకు కూడా హాజరై వచ్చాడు. ఈ కేసుతో తనకెలాంటి ప్రమేయం లేదంటూ అప్పట్లో మీడియా ముందుకొచ్చి వాపోయాడు నందు. అవసరమైతే డ్రగ్స్ టెస్టు చేయించుకోవడానికి కూడా తాను సిద్ధమన్నాడు. ఐతే తన భర్త విషయంలో గీతా మాధురి ఏమనుకుంటోందన్నది ఎవరికీ తెలియదు. ఇప్పుడు గీత ఆ విషయమై ఓపెనైంది. తన భర్త మీద తనకు పూర్తి నమ్మకముందని.. అతను దారి తప్పలేదని అని ఆమె అంది.
డ్రగ్స్ కేసులో తన భర్త పేరు టీవీల్లో చూసి తనతో పాటు తన కుటుంబ సభ్యులందరం షాకయ్యామని గీతా మాధురి చెప్పింది. తన భర్తకు డ్రగ్స్ అలవాటు లేదని.. అతను డ్రగ్స్ తీసుకునేంత దారి తప్పలేదని అంది. నందును డ్రగ్స్ కేసులో విచారణకు పిలిచినపుడు ఎలా ఫీలయ్యారని అడిగితే.. నందూ ఎలాంటివాడో తనకి పూర్తిగా తెలుసని .. తన దగ్గర అతను ఏ విషయాలూ దాచడని చెప్పింది. నందుపై తనకి పూర్తి నమ్మకం ఉండటం వల్ల విచారణ విషయంలో ఏమీ భయపడలేదని చెప్పింది. ఏ సంబంధం లేకుడా నందు పేరు ఈ కేసులో వినిపించడం తన అత్తింటి వారిని బాధించిందని ఆమె చెప్పింది. ఈ వ్యవహారం చూశాక నిప్పు లేకుండా కూడా పొగ వస్తుందనే విషయం అర్థమైందని ఆమె చెప్పింది.