టాలీవుడ్ లో మ‌రో కొత్త మ్యూజిక్ లేబుల్ రంగ ప్ర‌వేశం

Update: 2021-04-12 07:02 GMT
క్యాసెట్లు టేప్ రికార్డ‌ర్ల యుగం పోయింది. ఇప్పుడు అంతా డిజిట‌ల్... అంతా ఆన్ లైన్. అయినా కానీ డిజిట‌ల్ యుగంలో డౌన్ లోడింగుల రూపంలో ఆదాయాన్ని ఆర్జిస్తూ మ్యూజిక్ లేబుల్స్ బారీగానే ఆర్జిస్తున్నాయ‌న్న విశ్లేష‌ణ ఉంది. ఆ క్ర‌మంలోనే టాలీవుడ్ లో మ‌రో కొత్త మ్యూజిక్ లేబుల్ పుట్టుకొస్తోంది. ఈసారి వినోద‌రంగ దిగ్గ‌జం జెమిని నుంచి ఈ లేబుల్ పుట్టుకురావ‌డం ఆస‌క్తిక‌రం.

సుమారు 75 సంవత్సరాలుగా జెమిని గ్రూప్ తెలుగు సినిమా పరిశ్రమలో అంతర్భాగంగా ఉంది. ప్రఖ్యాత సమూహం జెమిని ఎఫెక్ట్స్ (విఎఫ్ఎక్స్), జెమిని స్టూడియోస్- జెమిని ల్యాబ్స్ ను ఈ గ్రూప్ నిర్వహిస్తోంది.

డైమండ్ జూబ్లీ సందర్భంగా జెమిని గ్రూప్ ఇప్పుడు కొత్త మ్యూజిక్ ప్రొడక్షన్ లేబుల్ అయిన `జెమిని రికార్డ్స్‌`ను ప్రారంభిస్తున్నామ‌ని ప్రకటించింది. ఇకపై టాలీవుడ్ ‌లో సంగీత నిర్మాణంలో అంటే ఆల్బ‌మ్  ల సృష్టి.. కొనుగోళ్ల‌లోనూ జెమిని రికార్డ్స్ పాల్గొంటుంది. వారు స్వతంత్ర సంగీత కళాకారులతో కలిసి పని చేస్తారు.

జెమిని రికార్డ్స్ తెలుగు సినిమా పరిశ్రమలో అగ్రశ్రేణి ప్లేయ‌ర్ గా ఎదగాలని లక్ష్యంగా పెట్టుకుంది. దాని గురించి మరిన్ని వివరాలు రాబోయే రోజుల్లో ఆవిష్కరించనున్నారు.

జెమిని సంస్థ మూలాల్ని ప‌రిశీలిస్తే ఎంతో ఆస‌క్తిక‌రం. జెమిని మోషన్ పిక్చర్... రేడియో.. టెలివిజన్ ఇతర వినోద రంగాల్లో ఉత్ప‌త్తుల‌ను అందిస్తోంది. ఇక‌పై ఆడియో కంపెనీతో మ్యూజిక్ రంగంలోనూ ప్ర‌వేశిస్తోంది. జెమిని ఇండస్ట్రీస్ అండ్ ఇమేజింగ్ లిమిటెడ్  1 ఏప్రిల్ 1946 లో ప్ర‌యివేట్ సంస్థ‌గా ఆవిర్భ‌వించింది. ఇది ప్రభుత్వేతర సంస్థగా వర్గీకరించబడింది. చెన్నై హెడ్ క్వార్ట‌ర్స్ గా జెమిని ప్ర‌స్థానం సాగిస్తోంది. హైద‌రాబాద్ లోనూ విస్త‌రించింది.
Tags:    

Similar News