నాని లాస్ట్ మూవీ ‘జెంటిల్ మన్’కు అంత గొప్ప టాకేమీ రాలేదు. పర్వాలేదు అన్నారు. ఫస్ట్ వీకెండ్ వసూళ్లు కూడా ఓ మోస్తరుగానే వచ్చాయి. దీంతో ఆ సినిమా లాస్ వెంచర్ అవుతుందేమో అన్న సందేహాలు కలిగాయి. వీకెండ్ తర్వాత వసూళ్లు బాగా డ్రాప్ అయ్యాయి కూడా. కానీ రెండో వారాంతం వచ్చేసరికి ‘జెంటిల్ మన్’ బాగా పుంజుకుంది. ఆ వారం వచ్చిన సినిమాలు తేలిపోవడమే అందుకు కారణం. ఆపై రెండు మూడు వారాలు కూడా సరైన సినిమాలు పడలేదు. అలా మొత్తం మూడు నాలుగు వారాల పాటు ‘జెంటిల్ మన్’కు కలిసొచ్చింది. నాలుగో వారంలోనూ ఓ మోస్తరు వసూళ్లు వచ్చాయి. మొత్తానికి ఈ సినిమా అనుకున్న దానికంటే ఎక్కువ వసూళ్లే సాధించింది. హిట్ కేటగిరిలో చేరిపోయింది.
నాని లేటెస్ట్ మూవీ ‘మజ్ను’ విషయానికి వస్తే.. ఎందుకోగానీ ఈ సినిమాకు రిలీజ్ ముందు అనుకున్న స్థాయిలో హైప్ లేదు. సినిమాను సరిగా ప్రమోట్ చేసి ఉంటే ఓపెనింగ్స్ భారీగా ఉండేవి. పైగా వర్షాలు కూడా దెబ్బ కొట్టాయి. దీంతో వరుసగా నాలుగు హిట్లు కొట్టిన హీరోకు రావాల్సిన స్థాయిలో ఓపెనింగ్స్ రాలేదు. అలాగని తీసిపడేసేలా లేవు. డీసెంట్ ఓపెనింగ్స్ వచ్చాయి. కానీ వీకెండ్ తర్వాత వసూళ్లు డ్రాప్ అయ్యాయి. ఇప్పటిదాకా ‘మజ్ను’ రూ.10 కోట్ల దాకా వసూళ్లు సాధించిందని అంచనా. కానీ రెండో వీకెండ్లో ‘హైపర్’తో పాటు ‘ఎం.ఎస్.ధోని’ కూడా రిలీజవుతున్నాయి. వీటి ప్రభావం కచ్చితంగా ‘మజ్ను’ మీద ఉంటుంది. ఆ తర్వాతి వారం అయితే ఏకంగా ఐదు సినిమాలు వస్తున్నాయి. అప్పటికి ‘మజ్ను’ సినిమాను థియేటర్ల నుంచి లేపేయక తప్పదు. కాబట్టి ‘జెంటిల్ మన్’ తరహాలో ‘మజ్ను’ మ్యాజిక్ చేసే అవకాశాలు లేవు. ఈ సినిమా యావరేజ్ గ్రాసర్ గా బాక్సాఫీస్ రన్ ముగించే అవకాశముంది.
Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/